అంతర్జాలంలో సంక్రాంతి (సంక్రాంతి కథల పోటీ)

అంతర్జాలంలో సంక్రాంతి
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ -2022)

రచన: బాలపద్మం (వి వి పద్మనాభ రావు)

ఉదయం సమయం ఆరు కావొస్తోంది. జాబిలి వెన్నెల చెట్ల మధ్యలోంచి ఓయ్యరంగా ఓ వైపు, ఉదయ భానుడు కిరణాలు ఇంకా అప్పుడప్పుడే దూరంగా కనిపిస్తూ మరో వైపు. పెరటి చెట్ల పూలు ఇంకా బద్దకంగానే ఉన్నాయి, విచ్చుకోడానికి సిద్దంగా.
ట్రింగ్… ట్రింగ్.. ట్రింగ్ అంటూ ఫోను మోగుతోంది.
విశ్వనాధం గారు, ఏమొయ్ కాంతం ఆ ఫోన్ చూడు, పిల్లలు అయి ఉంటారు అన్నారు, మంచం మీంచి.
హై.. అమ్మా ఎలా ఉన్నారు… అన్నాడు భద్రం, వాళ్ళ పెద్దబ్బాయి దుబాయ్ నుంచి. ఆ! చెప్పరా, మేం బానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు, కోడలు పిల్ల శాంతి, పిల్లలు ప్రజ్ఞ, ప్రతీక్ ఎలా ఉన్నారు రా. అంతా బావున్నాం అమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది. టైమ్ కి తింటున్నారా. నాన్న ఎలా ఉన్నారు. కోపం తగ్గిందా అన్నాడు.
కోపం ఏముంది రా, ఏదో ఏడాదికి ఓసారి వచ్చే వారు, ఈ మధ్య అది కూడా కుదరడం లేదంటూ మానేశారు అని బెంగ రా. మేము బానే ఉన్నాములే అంది కాంతమ్మ. సరే అమ్మా ఉంటాను, మళ్లీ రెండు రోజులు పోయాక చేస్తా అని ముగించాడు, కాంతమ్మ గారు ఏదో చెప్పే లోపు.
ఎవరూ అబ్బాయేనా, బానే ఉన్నారా అన్నారు విశ్వనాధం. హా, వాడే బానే ఉన్నారు.
రా ఇలా కూర్చో అన్నారు భార్యని. అది కాదే! ఇంత చదివించి, ఇంత వాళ్ళని చేసి విదేశాలకి పంపితే వీళ్ళు చూడు రావడానికి ఏదో వంక చెప్తున్నారు. మనం వెళ్దామంటే ఇప్పుడు వద్దు మీరు రాలేరు అని ఏదో చెప్తున్నారు. నిన్న భవాని చూడు అదీ అంతే. ఏమిటో వీళ్ళు ఇలా తయారయ్యారు, అన్నాడు. పొన్లేండి. మెల్లిగా వీలు చూసుకుని వాళ్లే వస్తారు అంది కాంతమ్మ. అలా అంటే బయట దేశాల్లో ఉన్న పిల్లలు అంతా అంతే కదండీ. లేవండి పళ్ళు తోమండి. కాఫీ తెస్తాను అని లేవ బోయింది. అలా కాదే ఇలా కలవడాలు మానేస్తే, మనుమలకి మనం ఏం తెలుస్తాము, బంధాలకి విలువ ఏముంది. ఏదో నెట్ లో కలుస్తాం, ఫోన్లో మాట్లాడతాం అంటే కాదు కదా. డబ్బు ప్రధానం గా తయారయ్యారు. అంటూ చెప్పే లోపు పని అమ్మాయి రావడం తో కొంత కామా పెట్టి లేచారు అవిడ. ఈయన పళ్ళు తోమడం, ఇద్దరూ కాఫీ తాగడం, స్నానాలు, పూజ, అల్పాహారం అన్నీ అయ్యే సరికి తొమ్మిది అయింది. అవిడ వంట ఏర్పాట్లకి, ఈ యన కాసేపు అలా మిత్రుల క్షేమ సమాచార సేకరణకి బయలు దేరారు.
ఈ లోపు మనం ఒక్కసారి నాలుగు రోజుల క్రితం వీరి పిల్లల తో వీళ్ళ వీడియో కాల్ సంగతి చూద్దాం.
ఆదివారం కావడం తో ఉదయం పదింటికి అంతా వీడియో కాల్ లోకి వచ్చారు. అన్నట్టు వీళ్ళ అమ్మాయి భవాని, అల్లుడు పిల్లలు చికాగో లో ఉంటున్నారు. మన విశ్వనాధం గారు భార్య బందరులో ఉంటున్నారు.
అందరూ ఎలా ఉన్నారు అన్నారు విశ్వనాధం గారు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏరి అన్నారు కాంతమ్మ గారు. క్షేమ సమాచారాలు హై హాల్లో లు అన్నీ అయ్యాకా, ఓ పావు గంటకే కోడలు, అల్లుడు, మనుమలు అంతా చెరో చోటికి ఎగిరి పోయారు, కాసేపు ఉల్లాసం కోసం చెరువులో స్నానానికి వచ్చిన పక్షుల్లా.
కాంతమ్మ: చూసారా వాళ్ళకి అసలు టైమ్ ఉండడం లేదు.
భద్రం: శాంతి కి ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు అమ్మా, పిల్లలు తెలుసు కాదా స్థిరంగా ఓ చోట ఉండరు.
భవాని: అల్లుడు కి ఏదో కాల్ ఉందమ్మా, పిల్లలు సరే సరి అంది.
విశ్వనాధం: సరేన్నర్రా, మూడు సంవత్సరాలు అవుతోంది, ఈ సారి సంక్రాంతి కి వస్తున్నారా, లేదా అని సూటిగా అన్నారు.
ముందుగానే ఆలోచించుకున్న అన్నా చెల్లెలు ఈ సారి.. అది.. నాన్న ప్రాజెక్ట్ పనులు ఉన్నాయి, పిల్లలు కూడా బోర్, రాం అంటున్నారు అంటూ నసిగే సరికి విశ్వనాధం గారికి ఒక్కసారి తన్నుకొచ్చిన దుఃఖాన్ని కోపంలోకి మార్చి…
ఏవర్రా ఆ మాత్రం జీవిత భాగస్వామికి, పిల్లలకి చెప్పు కోలేక పోతే ఎలా. కుటుంబం అంటే ఇంకా తాత, మామ్మలు ఉంటారు అని చెప్పాలి కదా. మీ విజ్ఞత అంతేనా! అన్నారు. దానితో ఖంగు తిన్న పిల్లలు, కాస్త తేరుకుని ఇలా ఇంటర్నెట్ లో కలుస్తాం కదా ఎంత బాగుంటుందో, వారం వారం ఇలా కలుద్దాం, పండగ మూడు రోజులు వీడియో ప్రోగ్రాం బుక్ చేద్దాం. పగలంతా కలిసే ఉండొచ్చు. మేము కూడా చికాగో వెళ్తున్నాం ఈ సారి అన్నాడు భద్రం. దానితో అయితే మీరు ముందే తయారై ఉన్నారన్న మాట అన్నారు ఈయన. అది కాదు నాన్న, కుదరడం లేదు, అదీ కాక టిక్కెట్ల రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి అన్నారు ఒకే సారి పిల్లలిద్దరు. కబర్లు చెప్పకుండా, వచ్చేది లేనిది చెప్పండి అనే సరికి, మెల్లిగా ఈ సారి కాదు కానీ ఇంకో నెలా రెండు నెలల్లో వస్తాం అన్నారు. ఈ సారి పండుగ మూడు రోజులు నెట్ లో కలుద్దాం రోజంతా అన్నారు. దానితో వీళ్ళు వినేలా లేరని అర్థం అయింది.
మళ్లీ భద్రం అన్నాడు, చూడు నాన్నా మన ఎదురుగా శర్మ గారు వాళ్ళ పిల్లలకి రావడం కుదరక పోతే ఆఖరి అమ్మాయి పెళ్ళి వీడియో లోనే చూసారు కదా, మనం అలాగే చేద్దాం, ఇది పండుగనే కదా అంటే, సరే ఏదో ఒకటి చెయ్యండి అని లేచారు.
కాంతమ్మ గారు కాసేపు ఆగి, చూడండి రా కళ్ళు కాయలు కాచి పోతున్నాయి రండిరా అంది. వస్తాంలే అమ్మా కుదరొద్దా చెప్పు అన్నారు. ఎప్పుడూ అలా అంటే ఎలా అర్రా అంది. సర్లే నాన్న కి కొంచెం నువ్వే చెప్పు, ఉంటాం మరి అన్నారు. అదండీ ఆ కాల్ సంగతి.
ఈ లోపు బోజనాల టైమ్ అయి భోజనాలు ముగించి నడుం వాల్చారు ఇద్దరూ.
ఈ సారి వీళ్ళకి బాగా బుద్ది చెప్పాలే అన్నారు విశ్వనాధం గారు. అవునండీ అంది కాంతమ్మ గారు. దానికి మంచి పథకం వేశా లే, వీడియో కాల్ చేస్తారు గా, చెప్తా. ఇంతలో పండుగ రానే వచ్చింది.
చికాగో నుంచి అప్పుడప్పుడు ఓ హై, హల్లో పడెద్దాం లే అని మన తెలివైన పిల్లలు నెట్ కనెక్షన్ బుక్ చేశారు. ఇక్కడ వీళ్ళింటి లో టీవీ కి దాన్ని అమర్చారు.
భోగినాడు ఉదయం తాపీ గా పదింటికి పిల్లలు కాల్ లోకి వచ్చారు. ఈ లోపు ఇక్కడ ఊరిలో హడావిడి మామూలుగా ఉంటుందా భోగి మంటలు వేయడం, వచ్చిన చుట్టు పక్కల పిల్లల నందరినీ పలకరించడం మహా కోలాహలం గా ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళు అంతా వీళ్ళతో చాలా సరదా గా ఒకే కుటుంబం లా ఉంటారు. వాళ్ళందరికీ ముందే చెప్పి ఉంచారు విశ్వనాధం గారు. ఆ కాల్ వచ్చే సరికి అందరూ వీళ్ళ ఇంటికి చేరు కున్నారు. అసలు ఆ హడావిడి అబ్బా! చూడాలి గానీ ఏం చెప్పేది అన్నట్టు ఉంది. అందరూ వీళ్ళ పిల్లల్ని పలకరించారు. అమ్మానాన్న టీవీ దగ్గరకి వచ్చే సరికి కరెంటు పోయింది. పోలేదండోయ్. ఇది మన విశ్వనాధం గారి ప్లాన్ లో భాగం. మొదటి రోజు కదా అక్కడ పిల్లలూ పోన్లే అనుకున్నారు. ఫోన్ చేసి మళ్లీ భోజనం టైమ్ లో కలుద్దాం అన్నారు. భోజనం టైమ్ లో లైన్ లోకి రావడం, కాంతమ్మ గారు ఒరేయ్ భద్రం నీకు ఇష్టం అని గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి చేశారా, తిను అని చూపించింది. అమ్మా భవాని నీకు ఇష్టమని బియ్యం పరమాన్నం చేసానే అంది, ఈ లోపు మళ్లీ కరెంట్ పోయింది. షరా మామూలే. రాత్రికి కూడా అంతే.
మరునాడు ఉదయం అన్నా చెల్లెలు ముందే లైన్ లోకి వచ్చి, ఈ కరెంట్ గోల ఏమిటమ్మా, బోలెడు డబ్బులు కట్టాం కాల్ కోసం అన్నారు. ఏమోరా, పండుగ రోజుల్లో కూడా ఇలా ఏడిపించే స్తున్నాడు అంది ఏమీ తెలియనట్టు. అన్నట్టు ఈ రోజు నీకష్ట మని బొబ్బట్లు, పులిహోర చేశారా, చెల్లికి ఇష్టమని గుమ్మడి కాయ బెల్లం కూర, ఆనపకాయ చల్ల పులుసు రా అంది. అయితే ఉండు చెల్లిని పిలుస్తా అనీ పిలిచే లోపు మళ్లీ కరెంట్ పోవడం. వీళ్ళు వీళ్ళ ఆనందం ఎందుకు పాడు చేసుకోవాలి అని చుట్టూ ఉన్న తమ పిల్లలు, మనుమలు లాంటి వాళ్ళతో కలిసి పోవడం జరిగింది. సరదాగా పెద్ద పండుగ గడిచింది.
అక్కడ అన్నా చెల్లెలు ఏమిటీ ఇలా అవుతోంది, కనీసం అమ్మా నాన్న దీవెనెలు కూడా తీసుకో లేదు అనుకున్నారు. పోన్లే రేపు చూద్దాం అని పడుకున్నారు.
మరునాడు కనుమ, ఈ పిల్లలిద్దరికి చాలా ఇష్టమైన పండుగ. ఒక్కసారి గతం లోకి వెళ్తే…
అమ్మా చూడవే అన్నయ్య నాకు చేప కూర పెట్టకుండా వాళ్ళ ఫ్రెండు కి ఇచ్చేస్తున్నాడు అంది భవాని.
ఏం ఇది చూడమ్మా నా నాటు కోడి పులుసు, చిల్లు గార్లు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి పంపేసింది అంది. ఈ రెండు చెయ్యడం లో కాంతమ్మ గారిది ఆరితేరిన చెయ్యి అండోయ్. వండుతుంటే వీధి అంతా గుప్పు మనాలి మరి అలా చేస్తుంది. అబ్బబ్బా ఉండండి రా కొట్టు కోకండి, ఇంకా బోలెడు ఉన్నాయి కావల్సినంత తినండి అని మరో రెండు, మూడు గిన్నెలు తెచ్చింది… అవి శుభ్రంగా తిని ఊరంతా తిరిగి సాయంత్రం పొద్దు పోయాక ఇంటికి చేరే వారు…@@
మళ్లీ వాస్తవం లోకి వస్తే, హా అమ్మా ఏం చేస్తున్నారు అన్నారు. ఏముందిరా అందరిళ్లకి వాళ్ళ పిల్లలు, మనుమలు వచ్చారు, మేము మాత్రం ఇలా నోట్లో వేలు వేసుకుని కూర్చున్నాం. అన్నారు, అవునే మాకు అదే అనిపిస్తోంది. ఏదోలా వస్తే పోయేది అని. ఏం వండావు అనే సరికి చెప్పింది వాళ్ళకి ఇష్టమైన వంటకాలు గురించి. అక్కడ వాళ్ళకి నోట్లో నీళ్ళు ఊరాయి. నాన్న ఏరి? ఈ రెండు రోజులు అసలు కనిపించే లేదు అన్నారు. ఎక్కడా! మీరు రాలేదని అసలు బయటకే రాలేదు, ఈ కాల్ కోసం చూడ్డం, కరెంట్ పోవడం, అస్సలు చిర్రు బర్రు లాడుతున్నారు, అన్నారు అసలు విషయం చెప్పకుండా. పిలుస్తాను అని చెప్పి ఏవండీ! అనడం మళ్లీ కరెంట్ హరీ అనడం జరిగాయి.
దానితో సాయంత్రం అయ్యే సరికి అన్నా చెల్లెలికి బుర్ర వేడెక్కింది.
ఇక్కడ విశ్వనాధం కాంతమ్మ మాత్రం హాయిగా, వీళ్ళు అభిమానించే పిల్లలకి భోజనాలు, బట్టలు కొనడం, అవీ ఇవీ అంటూ అసలు ఖాళీ లేకుండా గడిపేశారు.
అలా పండుగలు అయ్యాకా రెండు రోజులకు భద్రం ఫోన్ చేసి ఎలా ఉన్నారు అడిగి తెలుసుకుని, అవునే పండగల్లో ఆ వంటలు అన్నీ ఎందుకు చేశావు, మీరు ఇద్దరే కదా అన్నాడు. ఏమోరా మీ నాన్న అవన్నీ చెయ్యి, టివి లోంచి పెడితే అక్కడ పిల్లలు తినొచ్చు, టెక్నాలజీ నో ఏదో అది ఉంది అన్నారు, పైగా చాలా ఎక్కువ చేయించారు అంది అమాయకంగా ఉన్నట్టు. అయ్యో అలా ఏమీ ఉండదు అన్నాడు భద్రం. మరి అదెంటిరా మీరు కూడా టివి లో చూస్తే అచ్చు ఇక్కడికి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పారు కదా అంది. దానితో విషయం బోధ పడింది మన భద్రానికి. కొంచెం ఆలోచించి, ఉగాది కి వస్తున్నట్టు చెప్తాడు. అయ్యో మేము ఉగాదికి ఉండడం లేదు రా, నాన్న గారిని, నన్ను ముంబాయి రమ్మని, ఫ్లైట్ టిక్కెట్లు కూడా బుక్ చేసి చేతిలో పెట్టాడు మన ఎదురింటి పంకజం గారి అబ్బాయి అరుణ్. వాళ్ళ ఆవిడ, పిల్లలు అయితే మేము చెప్పేది విననేలేదు. మీ నాన్నగారికి మూడ్ బాగో లేదేమో, మనల్ని ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికే వెళ్దాం, పైగా అక్కడ తెలుగు వారితో ప్రోగ్రాం ఫిక్స్ చేశారు, అదేదో కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం అంటా అంది. సరేలే మరి, మళ్లీ మాట్లాడతా మరో సారి ఇలా మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లొద్దు అంటుంటే విశ్వనాధం గారు అందుకుని ఏమిట్రా అంటున్నావు, మేము వెళ్ళడానికి నీ పెత్తనం ఏమిటి టా.. మేము మీలా కాదు ఒకే మాట మీద ఉంటాం, నువ్వే మరో సారి అలా వాగకు అని ఫోన్ పెట్టేశారు.
తర్వాత అన్నా చెల్లెలు కి పరిస్థితి పూర్తిగా అర్థం అయింది. వాళ్ళ జీవిత భాగస్వాములకు, పిల్లలకు బాగా నచ్చ చెప్పి, ఇలా అయితే నాన్న మాతో ఇక మాట్లాడరు, ఆయన కి పంతం వస్తే ఇక అంతే అని. ఫిబ్రవరి లో ఆ ఊరి అమ్మ వారి జాతరకి వస్తున్నాం అని టిక్కెట్లు చేసేసాం అని ఫోన్ చేశారు.
దానితో కాంతమ్మ గారు, మీ ప్లాన్ భలే పని చేసిందండి, అసాధ్యులే సుమా అంది మురిసిపోతూ. మరే మనుకున్నావ్, కాంతమ్మ మొగుడా. మజాకా నా. నా పిల్లలు నాతో పరాచకాలా! అనే సరికి హాయిగా నవ్వు కొన్నారు ఇద్దరూ.
అదండీ చూసారు గా పిల్లలు ఏమి మిస్స్ అవుతున్నారు అన్నది వాళ్ళకే బోధ పడేలా చేశారు విశ్వనాధం గారు. ఎక్కడ ఉన్నా కనీసం ఏడాది కి ఒకసారి వచ్చి కన్న వాళ్ళని, పెరిగిన ఊరిని కలిసి వెళ్తూ ఉంటేనే బంధాలు దృఢంగా ఆప్యాయతలు స్థిరంగా ఉంటాయి. అందరూ అలాగే చేద్దామా మరి.
కథ కంచికి మనం ఇంటికి.

——–

You May Also Like

121 thoughts on “అంతర్జాలంలో సంక్రాంతి (సంక్రాంతి కథల పోటీ)

 1. Very nice story. Humorous yet mirrors present day problems of NRI children and elderly parents. Well timed and nice plot. Overall, a very good reading and food for thought.

 2. మీ అందరి అభిమానానికి ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. నన్ను మరింత గా ఆదరిస్తూ ఉంటారని కోరుతూ, మరిన్ని కథలు వ్రాసే ప్రయత్నం చేస్తాను

 3. సూపర్ చాలా బావుంది …ఇలాంటి మంచి కథలు నీ కలం నుండి జాలువారాలని కోరుకుంటున్నాను బాల పద్మం

 4. నేటి సమాజ పరిస్థితులకు అద్దం పడుతోంది ఈ కథ. సందేశాత్మకం గా చాలా బాగా రాసారు.👌

 5. The truth behind every festival for the parents whoever their kids in other countries, everyone will enjoy on the festivals but they will wait for them, Nice story and well written 🙏

 6. సమజనికి మంచి సందెషన్నిచ్చె కథ, చాలా బగుంది.

 7. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరంతా heartful గా చదివి మెచ్చుకుంటూ support చేస్తున్నందుకు కృతజ్ఞతలు

 8. Super sir
  Mir rasina e kadha ki
  Prekshakulanu aakattukune la story board chesthe mi kadhalaku tiruge undadhu good luck sir be on ultimate success.

 9. మంచి రచన మరియు చదవటానికి ఆసక్తి గా ఉన్నది.

 10. చివర్లో ఆ మాట అద్భుతహా!!!
  నేటి నిజాన్ని కళ్లకు కనిపించేలా కథగా మలిచిన కవిగారికి హృదయ పూర్వక ధన్యవాదాలు!!! 👏🙏🙏

  1. మీకు అంతగా ాా ఆ క ట్టు కున్నందుకు ధన్యవాదాలు sir.t

 11. కథ, కథనాన్ని మెచ్చుకుని, కామెంట్స్ పెడుతూ అభినందించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.

 12. చాలా బాగుంది..తెలుగు కూడా చాలా అర్దం అయే విధంగా ఉంది

 13. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చాలా బాగుంది. కనుమ రోజు “నాటు కోడి పులుసు, చిల్లు గార్లు” అదిరింది. 😋

  1. మీకు అంతగా ాా ఆ క ట్టు కున్నందుకు ధన్యవాదాలు sir.t

  1. Nice story. Main content is remembering sathamanam bhavathi movie but the solution is different and good.

 14. Wonderful story and drafting. Very exciting. Everyone should know the value of parents and meeting them.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!