భగవంతుడి నామస్మరణే నీకు లక్ష రక్ష ..!

భగవంతుడి నామస్మరణే నీకు లక్ష రక్ష ..!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

       భగవంతుడు అనే మాటే పలకడానికీ … వినడానికి ఎంతో బాగుంటుంది. కష్టాల్లోను … నష్టాల్లోను భగవంతుడా ఏమిటి మాకీ పరీక్ష! అని ఆయనని తలచుకోవడం జరుగుతూ వుంటుంది. భగవంతుడా అని ఆయనని అనుకోవడంతోనే మనసు తేలికపడుతుంది. అలాంటి భగవంతుడు అనేక నామాలతో పిలవబడుతుంటాడు. కోట్లాది భక్తులతో కొలవబడుతుంటాడు. భగవంతుడు లేకపోతే మనకు జయం లేదు విజయం లేదు. అనంతమైన ఈ విశ్వమంతా వ్యాపించి వున్న భగవంతుడికి రూపాన్ని ఏర్పాటు చేసుకుని, ఆయనకిగల శక్తులనుబట్టి వివిధ నామాలతో పూజిస్తూ వుంటారు. అందువల్లనే భగవంతుడి ప్రతినామం శక్తిమంతమైనదే, మహిమగలదేనని అంటారు. అలాంటి నామాలలో ఎవరికి ఇష్టమైన నామాన్ని వాళ్లు పదేపదే స్మరించుకుంటూ వుంటారు. అదే మనకు అత్యంత మానసిక ప్రశాంతత ఇస్తుంది.
కళ్ళు మూసి ధ్యానం చేయుట కంటే కళ్ళు తెరిచి నలుగురికీ సాయం చేయుట చేత భగవంతుడి ఆశీర్వాదం పొందగలం అని నా విశ్వాసం. ఈశ్వర పరమేశ్వర .. ఉమామహేశ్వర అనీ, కేశవా .. నారాయణ .. మాధవ .. వాసుదేవా సాయిదేవా అని తలచుకుంటూ వుంటారు. ఎవరికి ఇష్టమైన నామాన్ని వాళ్లు సదా స్మరిస్తూ వుండటం వలన, ఏదైనా ఆపద ఎదురైనప్పుడు అసహజంగానే ఆ నామం నోటివెంట వస్తుంది. భగవంతుడు అంటే దయాసాగరుడు. ప్రేమ, కరుణ, శాంతి కలగలిసిన సముద్రం లాంటి రూపం ఆయనది. ఈ క్షణం నుంచీ ఆయన స్మరణలో ఉండడానికి ప్రయత్నించుదాం . భగవంతుణ్ణి ధ్యానిస్తే పాపకర్మలు నశిస్తాయి. అప్పుడే మనం ఆ పరమాత్ముణ్ణి చూడగలము
భగవంతుడిని కదిలించడానికీ ఆయన కదిలిరావడానికి ఆ మాత్రం అవకాశం చాలు.  కష్టాల్లో పడినప్పుడు. ఆపదలో చిక్కుకున్నప్పుడు ఏ నామమైతే బయటికి వస్తుందో అది తప్పకుండా ఆ గండం నుంచి బయటపడేస్తుంది. ఒక రక్షణ కవచమై నిలిచి కాపాడుతుంది. భగవంతుడి ప్రతినామం భక్తుడిని రక్షించే శక్తిని కలిగివుంటుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు వినిపిస్తుంటాయి.
కనిపిస్తుంటాయి. భగవంతుడి నామస్మరణ ఆయనపై గల అపార విశ్వాసాన్ని ఆవిష్కరిస్తుంది.
అనంతమైన ఆయన అనుగ్రహాన్ని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సమస్త లోకా సుఖినోభవంతు.

***

You May Also Like

4 thoughts on “భగవంతుడి నామస్మరణే నీకు లక్ష రక్ష ..!

  1. నిజం. ధ్యానం తోనే ఏకాగ్రత్త కుదిరి నామ జపం చేయ గలం
    🙏🙏🙏

  2. మన జీవితం లో దైవ నామస్మరణ ముఖ్యం అని బాగా చెప్పారు
    🙏🙏🙏🙏🙏

  3. చాలా బాగా చెప్పారు విద్య 👍గారు. దైవం కన్నా ఏది ముఖ్యం కాదు.

Leave a Reply to సుధాకర్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!