పంచతంత్ర కథలు (పుస్తక సమీక్ష)

పంచతంత్ర కథలు
(పుస్తక సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: మాధవి కాళ్ల

పుస్తకం పేరు: పంచతంత్ర కథలు
రచయిత: కె. రవికుమార్

పంచతంత్రం అంటే పంచ అంటే అయిదు, తంత్రం అంటే ఉపాయాలు.. అవి (1) మిత్ర లాభం (2)మిత్రభేదం (3)విగ్రహం (4)సంధి  మరియు (5)లబ్ధనాశనంగా..

మిత్ర లాభం:
మనిషి జీవితం సాఫీగా సాగిపోవటానికి కావలసిన విచక్షణ, నీతి నియమాలను, సూత్రములను చక్కని  కథలుగా మలిచారు. ఈ కథలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఓ మంచి పాఠ్యాంశం…ఈ కథలో పాత్రలన్నీ  పక్షులు, జంతువులు, మనుషులలో ఉండే పేరాశ, దురాశ, మోసకారితనం, పిసినారితనం, నీతి, ధర్మగుణం, సమయస్ఫూర్తి, క్షమాగుణం లాంటి మంచి గుణాలు, చెడ్డ గుణాలు  ఉంటాయి.. ఒక్కొక్క పాత్రది ఒక్కొక్క నైజంగా ఉన్నాయి.
ఈ కథలలో కాకి అరుపులతో కాక పలుకులతో  పలకతీస్తుంది.. లేడి ముద్దు ముద్దు మాటలతో మనసు మురిపిస్తుంది.. ఎలుక ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది. సింహం, ఎద్దు, పావురం, నక్క మానవభాషలో మాట్లాడి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.. ప్రతి కథ ఓ నీతితో ముగిసి మనలో మానసిక వికాసానికి తోడ్పడతాయి. మానవ జీవితంలో ఎదురయ్యే ఆపదలు, సమస్యలకు చక్కని పరిష్కారాలుగా తోస్తాయి. ఈ కథలు తరతరాలుగా అందరినీ అలరిస్తూనే ఉన్నాయి.
మిత్రాభేదం:
ఈ కథలో రెండవది మిత్రభేదం.. ఇద్దరు స్నేహితుల మధ్య స్వార్థం కోసం విరోధం పుట్టించే వ్యక్తులు కూడా  ఉంటారు.. క్రూరజంతువు అయిన సింహం, సాధుజంతువు అయిన ఎద్దు మిత్రులు అవుతాయి. ఈ రెండింటి మధ్య రెండు గుంటనక్కలు చెప్పుడు మాటలతో విరోధం  పుట్టిస్తాయి. చివరికి సింహం, ఎద్దు పొట్లాడుకుంటాయి. ఎద్దు చనిపోతుంది.. ఆ తరువాత సింహానికి అసలు నిజం  తెలుసుకుంటుంది.

You May Also Like

One thought on “పంచతంత్ర కథలు (పుస్తక సమీక్ష)

Leave a Reply to Ramya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!