ఫీజులు బాబోయ్ ఫీజులు
రచన:రాజ్
ఫీజులు బాబోయ్…ఫీజులు!
జులం చేసి మరీ…
జేబులు ఖాళీ చేసే ఫీజులు!
బడికెళ్తే…ఫీజు
గుడికెళ్తే…ఫీజు
నీటికి…..ఫీజు
మాటకి….ఫీజు
మట్టికి…ఫీజు
మానుకి…ఫీజు
పార్క్ కి…ఫీజు
పార్కింగ్ కి…ఫీజు
ఆసుపత్రికి…ఫీజు
RTO ఆఫీస్ కి…ఫీజు
ఫీజులు బాబోయ్…ఫీజులు
బెదరగొట్టే…ఫీజులు!
Kg ల నుండి PG లకు రాస్తారు..
కార్పొరేట్… గ్రీజు!
కాలు జారీ పడుతూనే ఉండాలి…
మనం…రోజూ!
జాయిన్ అయ్యేవరకు…
చేస్తారు….మసాజు!
తదుపరి చేయిస్తారు…
మన అకౌంట్….క్లోజు!
కార్పొరేట్ కన్వెంట్ లంటే…
అందమైన అద్దాల…గాజు
అద్దాల గాజులంటే…
అందరికీ…మోజు!
కానీ!
అవి పగలక తప్పదు…
ఏదో ఒక….రోజు!
సర్కారోడి దవాఖాన…
అబ్బో! తలచుకుంటే…
ఎంతో…. గలీజు!
ప్రైవేట్ పెద్దాసుపత్రి కి వెళ్దామంటే…
రాసివాల్సిందే..నీ ఆస్తి మొత్తం…లీజు!
డాకటేరు సదువికి..
ఇంజనీరు సదువికి..
పెట్టుబడి కోట్లలో….ఫీజు!
గుంజి..గుంజి గుంజుకుంటుండ్రు
జనాల దగ్గర…. రోజూ!
రాజ్యాంగం సెప్పింది..
విద్య..వైద్యం..అందరికీ…
వితౌట్…ఫీజు!
కానీ!
రాజకీయం..రాసింది
అన్నింటినీ….రెండు యుగాలకి…లీజు!
ఎప్పుడు వస్తుంది అండీ…
మనది…మనం…
లాక్కునే…. ఆ రోజు!
ఫీజులు బాబోయ్…ఫీజులు!
జన్మకి…ఫీజు!
కర్మకి….ఫీజు!
……
బాగుందండి… ఫీజుల గోల😊😊👍