తొలి పరిచయం

తెలుగు సాహిత్య రంగంలో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న కొందరు స్నేహితులతో కలిసి, ఒక సమూహంగా ఏర్పడి, మా రచనలు మరింత తేలికగా పాఠకులకి చేరాలి అన్న అభిలాషతో “తపస్వి మనోహరం” రూపకల్పన చేయడం జరిగింది.

మాతో పాటుగా కొత్త రచయితల రచనలకు కూడా మా ఈ వేదిక ఉపయోగకరంగా ఉండాలి అన్నది మా చిన్ని ఆశ.

రచయితలు, కొత్తగా రాయాలి అనే అభిలాష ఉన్నవారు అందరూ కలిసి ఒకే చోట తమ రచనలు ప్రచురించే వేదికగా మాత్రమే కాక, రచయితలకి తగిన గుర్తింపు, ప్రోత్సాహం దక్కేలా చేయాలన్నది మా కోరిక.

మహిళా దినోత్సవ సందర్భంగా మా ఈ వేదికను కవయిత్రుల, రచయిత్రుల రచనలతో మొదటి సంచిక మొదలు పెట్టడం గర్వకారణంగా ఉంది.  అంతే కాకుండా ఇది మొదలుపెట్టినది, పూర్తిగా నిర్వహణ బాధ్యతలు చూసుకునేది కూడా మహిళలే. ఒక విధంగా ఈ సంచిక మహిళల చేత స్థాపించబడిన మొట్టమొదటి తెలుగు ఆన్లైన్ సాహిత్య వేదిక.

మొదటి వారం ప్రత్యేక సంచిక అయినందువల్ల కేవలం కొందరు రచయిత్రుల కథలు, కవితలతో మాత్రమే మీ ముందుకు తీసుకు రావడం జరుగుతుంది.

ఇకపై ప్రతి ఆదివారం మన సంచిక సరికొత్త కథలు, కవితలు, సీరియల్స్ తో మాత్రమే కాక , మన దేశంలోని పుణ్యక్షేత్ర ప్రత్యేకతలు గురించి, చూడదగ్గ ప్రదేశాలు గురించి, ప్రత్యేక ఆర్టికల్స్, ఆరోగ్యం,  ఆహారం గురించి వివరాలు, అలాగే మనకి తెలియని మన సంస్కృతిలో ఉన్న కొన్ని గొప్ప విషయాలు గురించి.. ఇలా అన్ని విధాలుగా మిమ్మల్ని అలరించటానికి ప్రయత్నం చేస్తాము.

“ప్రతి స్త్రీ ఒక సెలబ్రిటీ” అన్న ఒక కొత్త కాన్సెప్ట్ తో మా వీక్లీ మాగజైన్ ముఖచిత్రంగా.. మనకు పరిచయం ఉన్న, మన చుట్టూ ఉన్న చిన్నారి పాపలు, మహిళల ఫొటోస్ ముఖ చిత్రంగా పెట్టడం జరుగుతుంది (వారి అనుమతితో).

ఈ వేదికలో.. వీక్లీ మాత్రమే కాకుండా, అందరూ తమ రచనలు ప్రచురించే అవకాశం కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. కథలు, కవితలు, సీరియల్స్ ఎవరికి వారే, వారి బ్లాగ్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఏర్పాటు చేయటం జరిగింది. సంచికలో ఒక్కరివే అన్ని రచనలు ప్రచురించడం వీలుకాదు, కనుక తమ రచనలు అన్ని పాఠకుల చెంతకు చేరాలి అనుకున్న రచయితలు, ఎవరికి సంబంధించిన విభాగాలలో(బ్లాగ్స్) వారి రచనలు పెట్టవచ్చు. రచనా విభాగాలలో ఎటువంటి కండీషన్స్ లేవు కానీ, అసభ్యకరమైన సమాచారం ఉన్న రచనలు స్వీకరించబడవు.

    భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆలోచనలతో, కొత్త ఫీచర్స్ తో తెలుగు సాహితీ అభిమానులని అలరిస్తాము అని తెలియచేస్తున్నాము.

ఈ సంచిక మరింత ప్రజాదరణ పొందడంలో సాహిత్య అభిమానులు, రచయితలు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. మీ నుండి సలహాలు, సూచనలు స్వీకరించి మన ఈ వేదికను మరింత అభివృధి పథం వైపు నడిపించేందుకు అనుక్షణం నిబద్ధతతో కృషి చేస్తాము, అందరికీ ప్రోత్సాహం అందిస్తూ కలిసి నడుద్దాం.

ఈ సరికొత్త ప్రయాణంలో మాకు ఎంతో సహకరిస్తున్న తోటి రచయితలకు, స్నేహితులకు మా కృతజ్ఞతలు.    “తపస్వి మనోహరం” అందరి మనసులను దోచుకునే సుమనోహర రచనల సమాహారం అవుతుందని ఆశిస్తూ…

   ఇట్లు

తపస్వి & టీమ్

 

20 thoughts on “తొలి పరిచయం

  1. నేను కొత్తగా ఈ సమూహం లో చేరుతున్నాను 🙏

  2. నేను ఇప్పుడిప్పుడే ఐ ప్రపంచం లోకి అడుగు పెట్టాను. ప్రతిలిపిలో నా కవితలు, షార్ట్ స్టోరీస్ పెడుతున్నాను,మీ వెబ్సైట్ ఇప్పుడే చూశాను,నా కథ వసంత కోయిల ప్రతులిపి పోటీ లో ఎన్నుకో బడింది,అది మీ వెబ్సైట్ లో డైరెక్ట్.గా upload చేశాను.మరిన్ని ఊసులు మీతో చెప్పుకోవాలి అని ఆశిస్తున్నాను.

  3. నేను మొదటిసారిగా ఈ పత్రిక చూసాను. పత్రిక తొలి పరిచయంలోనే మంచి భావన కలగటం, టైటిల్ కూడా చాలా నచ్చింది. ఈ పత్రిక దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తూ, శుభాకాంక్షలతో ..

  4. తపస్వి పత్రికకు అభినందనలు,ఇప్పుడే మొదలైన ఈ చిగురు మహా మ్రాను అవుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను.నిరంతర కృషి,పట్టుదల,నిజాయితీతో కూడిన దృక్కోణం భవిష్యత్ కి మంచి ఫలితాల్నే అందిస్తాయి.

  5. తపస్వి టీం వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు చేసిన ఈ రూపకల్పనలువ, విభాగాలు అన్ని చాలా చక్కగా అమరినవి. ఎంతోమందికి ఆనందాన్ని కలిగిస్తూ మరింత ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

      1. మానోహరం వాట్సాప్ గ్రూప్ లో add అవ్వండి …6300414566 /9700734601 ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చెయ్యండి …లేకుంటే మీ రచనలను manoharam.editor@gmail.com mail కి పంపగలరు.🙏

  6. Mana manoharam magazine chala colourful ga undandi… mana kosam manavalle rasinavi mana vaara patrikalo chustunte entho santhosham ga undi… ee ratchayitrulu andaru unnatha shikaralanu cherukovalani aasisthu…..💐💐💐💐

  7. తపస్వి మనోహరం వార పత్రిక స్థాపించిన పత్రికా నిర్వాహకులు అభినందనలు.
    స్త్రీ ల తో స్త్రీ ల చేత స్త్రీల కొరకు ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ వార పత్రిక మంచి గుర్తింపు పొందాలని, మంచి ఆలోచనలను పంచే విధంగా ఉండాలని, పత్రిక దిన దినాభి వృది చెందాలని ఆ భవంతుడికి కోరుకుంటున్నాను

Leave a Reply to పవన్ మయూరి బండారు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!