మట్టి బ్రతుకులు

5 thoughts on “మట్టి బ్రతుకులు

 1. ఈ అంతర్జాల కవితా సంపుటిలో నేటి మట్టి బ్రతుకుల జీవితాన్ని కవితాత్మకంగా రచయితలందరు చాలా బాగా రచించారు
  మట్టిని నమ్ముకుని జీవించే సైరికుడు(రైతు) సైనికుడిలా ఎంత సేవ చేస్తున్నాడో…ప్రతి ఒక్కరూ తమ తమ కవితలో చెప్పిన తీరు చదువుతుంటే ఒక రైతుగా(ప్రవృత్తి) నేను అనుభవించే ఊహించే విషయాలు ఎన్నో కళ్ళకు కట్టినట్లు అనిపిస్తున్నాయి

  ప్రకృతి నుంచి పాలకుల దాకా
  రైతును ఎప్పటికప్పుడు కష్టాల పాలు చేస్తున్న
  మట్టిపై ఉన్న ప్రేమతో‌…తన కృషిని పట్టువదలకుండా సాగిస్తున్నాడు అనేలా
  శ్రమ సౌందర్య జీవులుగా కాలంతో పోటిపడి మరి తమ కుటుంబం కోసం సాగు చేసినా అది సమాజ బాగు కోసం అని
  తను పండించే పంటతో లాభం రాకపోయినా సరే పండించడం మాత్రం మరచిపోడు అనేలా మట్టి బ్రతుకులు సంపుటిలో కవితలుగా అక్షర రూపం దాల్చాయి అని చెప్పొచ్చు

  కుదిరిన రోజు తల్లిలా అందరి కడుపు నింపింది
  కుదరని రోజు నెర్రలు చాచి బాధతో గుండె బద్దలు చేసుకుంది అని
  తపస్వి గారి కవితలో మట్టి తల్లి యొక్క మాతృత్వాన్ని తెలియజేసేలా రాస్తూనే
  మమ్మల్ని మట్టి ఎప్పుడు మోసం చేయలేదు
  మనుషులుగా మనం కాసుల మోజుతో మట్టి సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తున్నాం ఇకనైనా మారుదాం
  లేకపోతే మట్టి దున్నే రైతుల గురించి పుస్తకాల్లో చదివే రోజు వస్తుంది అని కవితాత్మకంగా చాలా బాగా చెప్పారు

  జి.వి లక్ష్మి గారి మట్టిలోనే… మట్టితోనే అనే శీర్షికతో రాసిన కవిత
  శ్రమజీవి యొక్క అంతరంగాన్ని కవితాత్మకంగా తేలికైన పదాలలో పొందికగా అమర్చిన రాసిన తీరు మట్టిని నమ్ముకున్న మనిషి యొక్క మాటల్లో…చెప్పినట్టు భలే ఉంది

  బుజ్జమ్మ కవితలో అయితే
  మట్టిని నమ్ముకున్న మనిషి గతంలో ఎలా ఉండేవాడో
  అదే నేలను అమ్ముకుని ఇప్పుడు ఎలా జీవిస్తున్నాడో
  చెప్పే ప్రయత్నం చేశారు

  ప్రకృతి విలయ తాండవం చేసినా
  నీ పంట కల్లలై జారిపోతున్నా
  నీ కళ్ళలో ఆశ తరగదే ఓ కర్షకా అని
  కర్షకులు నిత్య జీవితంలో లాభం వచ్చినా రాకున్నా తాను నమ్ముకున్న నేలను సాగు చేయకుండా ఉండలేడు అనే సత్యాన్ని
  విజయ మలవతు గారి కర్షకా… కవితలో చదవవచ్చు
  ఇందులో ఉన్న ప్రతి కవితలో కూడా మట్టి మనిషి జీవితాన్ని అంతరంగాన్ని ఆవిష్కరించిన రచయితలందరికి వందనం

  చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే
  ప్రతి ఒక్క కవితలో కూడా మట్టి అనే పదాన్ని చదువుతుంటే
  మట్టి పరిమళపు సుగంధాన్ని ఆస్వాదించినంత గమ్మత్తుగా అనిపిస్తుంది

 2. అందరి కవితలు చాలా బాగున్నాయి.ముందుమాట సూపర్ గా ఉంది.
  అన్ని కవితలూ ఒకేచోట చూడడానికి చాలా బాగుంది.
  మీ ఆలోచన అధ్బుతం.థాంక్యూ తపస్వి టీమ్.💐💐💐💐💐

 3. చాలా బాగుంది అండి పత్రిక, కొన్ని కవితలు చదివాను చాలా బాగున్నాయి .congartulations సర్,తపస్వి మనోహరం టీమ్. all the best సర్👌👌👏👏👏👏👏💐💐💐💐💐💐

 4. Thank you soooooo much Karthik garu , తపస్వి &టీమ్… చాలా చాలా బాగుంది e- book. అందంగా అలంకరించి అందించారు మా కవితలు. Thank you soooooo much.
  కవితా మిత్రులందరికీ అభినందనలు🤝🤝🤝🤝🤝💐💐💐👏👏👏👏

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!