రచన – స్వప్న ప్రియ
తరాలు మారుతున్నా
అంతరాలు పెరుగుతున్నా
అందరిలో కొలువుంటావు
అందరినీ కలుపుతుంటావు
బూడిద పూసుకుంటావు
వ్యాఘ్ర చర్మం కప్పుకుంటావు
అభిషేకంలో ఉన్నది
పాలో నీళ్ళో కూడా చూడవు
అడిగితే చాలు వరాలిస్తావు
ఒక్కసారి మొక్కితే చాలు
ఎన్ని పాపాలైనా క్షమిస్తావు
ఓ దూది ముక్కను వెలిగించి
దణ్ణం పెడితే చాలు
చల్లని చూపు చూస్తావు
ఎందుకయ్యా…
అంత జాలి నీకెందుకయ్యా…
మరీ అంత
భోళాతనం వద్దు శివయ్య
ఇది గుడిలో దేవుణ్ణి కూడా
మింగే లోకం కదయ్యా…
చిన్ని చిన్ని తప్పుల్ని
సరిదిద్ది సన్మార్గంలో పెట్టు
మహాదేవయ్యా… మనుషుల్లో మంచితనాన్ని
పెంచే మంత్రమే నీ నామం కదయ్యా…
అదే అందరికీ
మృత్యుంజయ మంత్రమై
విలసిల్లే వరమిచ్చిన
కైలాసవాసివి నీవయ్య…
“ఓం నమః శివాయ…”
******

🙏🙏🙏👌👌
Good chaala bagundi
Super