ఆదిశక్తి
చూసారా మగువ తెగువ
మరిచారా అతివ విలువ
దరి చేరగలరా ఎవరైనా?
ఆట బొమ్మగ మలిచి
ఒదిగి వుండేలా చేశాను
తిరుగు లేదు నాకని
హద్దు మీరి పోయావు
అబల యేమి చేయునని
విర్రవీగి అపహాస్యం చేసావు.
సహనానికీ హద్దుందని మరిచి
సంస్కారం పేరుతో గీసిన
అడ్డ గీత ఉంది కదా
దాటిరాలేదనుకున్నావా?
మత్తు పొరలు తొలిగించేలా
నేడు కత్తి దూసుకొచ్చె
దుష్ట సంహారం చేయాలని
మగువ లోని ఆదిశక్తి
ఉగ్రరూపందాల్చెచూడరా
ఎదురు నిలిచే దమ్ము
మీలో ఎవరికి వుందిరా?
రచన: బోర భారతీదేవి