యాదక్క
భద్రం రా ఓరి సిన్నోడా
ఇటువైపు రాబోకురో ఓ కుర్రవాడా
ఏమన్నవో ఏమో ఆ కత్తిపట్టిన యాదక్కని
అద్దిరబన్నా అంటూ గోష కట్టి కాపు కాస్తోంది రోయ్
వీపులో పెట్టిన కత్తి చుస్తే
నీ కథే చెప్పేలా ఉంది రోయ్
ఇది ఉత్త కత్తో లేక ఒరిజినలో
అర్థమే కాలేదురో
వాటం చుస్తే మట్టగ ఉతికేలా ఉందిరో
అక్క కథ ఏమో జోరుగా ఉంది
ఆ *కత్తి ఆమేకే ఎక్కడ గుచ్చుకుంటుందో* అని భయంగా ఉంది
అసలే ఎమన్నావురో ఆ యాదక్కని
అక్కన్న మాట మరిచి “ఆంటీ” అన్నవా ఏంటి
అయితే నిన్నెవడు కాపాడలేడురో
సావు దెబ్బలే నీకు తప్పవురో
అందుకే ఇటువైపు రాబోకురో
ఈ సిన్నోడా వచ్చావో చచ్చావే
కూసింత భద్రం రా కుర్రవాడా
రచన: ఉదయగిరి దస్తగిరి
Nice 😊😊😊