అయ్యారే!

అయ్యారే!

అయ్యారే!
కరోనా కష్టం
నాదాకా రాదే, రాలేదని
కుప్పింగతులేశాను.

ఇలా కసి తీర్చుంటుందని
కలనైనా కనలేదు.

ఎదురుచూశా నాడు…
నోములు, వ్రతాలకై…
వస్తాయని శనగలు తాలింపుకై…
జిహ్వ చాపాల్యం తీర్చుటకై.

తలవనైనా లేదు నేడు…
ఆ పేరంటాండ్రని నేనౌతానని.
ఇట్టా బుక్కౌతానని.

ఇంటి దీపం కోసం కట్టా ఈ వేషం
మారేషం కాదండీ…
ముత్తయిదువ నేనండీ.
అంతా ఆలి కోసమే
మీరు గ్రేటని ఆమె నోట
ఇనేటందుకే.

రచన :: ఫణికిరణ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!