శర్మ గారింట్లో సంక్రాంతి (సంక్రాంతి కథల పోటీ)

శర్మ గారింట్లో సంక్రాంతి

(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: బాలపద్మం  (వి వి పద్మనాభ రావు)

ఏమోయ్! పొట్టీ ఏం చేస్తున్నావ్ అన్నాడు వంటింట్లోకి అడుగు పెడుతూ శర్మగారు. ఆయన భార్య ప్రభావతిని ఎవరూ లేనపుడు ముద్దుగా పిలుచుకునే పేరు పొట్టి. ఆమె హా! ఏమిటండీ హడావిడి, పండుగకు ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది. నాకసలే కంగారు ఎక్కువని తెలుసు కదా. అన్నీ వండుతాను మీరేం హడావిడి పడకండి అంది ప్రభావతి అనబడే ఆయన పొట్టి. అది కాదే! అమ్మాయి అబ్బాయిలు వాళ్ళు ఉన్న నాలుగు రోజులు ఆ పంకజాన్ని ఇక్కడే ఉండమని చెప్పావా లేదా గుర్తు చేశాడు. హా చెప్పా నండీ ఓ రోజు ముందే వస్తానంది. డబ్బులు కూడా పంపాను. ఎల్లుండి బయలు దేరి వస్తుంది. పంకజం అంటే పక్క ఊరులో ఉండే వీళ్ళ కావలసిన వారి అమ్మాయి. ఏ అవసరం వచ్చినా వీరికి కాదనకుండా చేదోడు గా ఉంటుంది. వీరు వాళ్ళ కుటుంబానికి చేసిన సాయానికి అభిమానం అలాంటిది తనకి.
పిండివంటలు అన్నీ చేస్తున్నారు మెల్లిగా. పంకజం భర్త రామేశం డ్రైవర్. అతను కూడా పండుగ రోజుల్లో ఇక్కడే ఉండి పోతాడు. వాళ్ళు కూడా వీళ్ళ పిల్లలతో బాటే పండుగ లో భాగం వీరికి.
ప్రతి ఏటా సంక్రాంతి అంటే వీరికి ఎంతో సందడి. శర్మ గారు, ప్రభావతి లు ఇద్దరి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి కోనసీమ గన్నవరం లో ఉంటున్నారు. చేసింది ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగమే అయినా చాలా పద్ధతిగా ఎదిగారు, సహ దర్మచారిణి కి సిసలైన నిర్వచనం మన ప్రభావతి. శ్రీ లలితా దేవి సేవకులు, భక్తులు, అన్నీ ఆ తల్లి భిక్షే అని అపారమైన నమ్మకం వీరిది. ఇద్దరు పిల్లలు చక్కగా క్రమ శిక్షణ తో పెరిగారు. పెద్దబ్బాయి మంచి సాఫ్టువేరు కంపెనీ, పూణె లో మంచి స్థాయి లో ఉద్యోగం లో ఉన్నాడు. చిన్నబ్బాయి డాక్టర్ చేసి చెన్నయ్ లో స్థిర పడ్డాడు. ఇద్దరికీ తెలిసిన వారి అమ్మాయిలను ఏరికోరి తెచ్చుకుని పెళ్ళిళ్ళు చేశారు. వీరితో పాటు వీరికి దేవుడు ఇచ్చిన ఓ కూతురు ఉంది. వీరి ఇద్దరి కన్నా పెద్ద అమ్మాయి. శర్మ గారి వరుసకు అన్నయ్య, అతడు లేక పోవడం తో వీరు పెళ్లి చేశారు ఆ అభిమానం తో వీళ్ళే అమ్మా నాన్నలు ఆ అమ్మాయికి. అమ్మాయి తల్లి వేరే ఊర్లో ఉంటున్నా ఎప్పుడూ సంక్రాంతి కి ఇక్కడికే వస్తుంది.
సంక్రాంతి కోలాహలం వీరి ఇంట్లో అంతా ఇంతా కాదు. అసలు నాలుగు రోజులు వీరికి సరిపోదు అంటే అతిశయోక్తి కాదు. ఎన్ని పనులు ఉన్నా అందరూ వారి వారి వీలును బట్టి నాలుగు నుంచి వారం రోజులు ఇక్కడ గడపాల్సినదే.
ఇంతలో పిల్లా పాపలతో బాటు పండుగ రానే వచ్చింది. ముందు రోజు సాయంత్రమే మామిడాకుల తోరణాలు కట్టి భోగి మంట కోసం ఎండు చెట్ల మొదళ్ళు, ఇతర పాత కలప సిద్దం చేశారు.
మొదటి రోజు భోగి. ఉదయమే ఊరు తో బాటు ఇల్లంతా సందడిగా ఉంది. ముందు రోజు దిద్దిన ముగ్గుల ముంగిట లో భోగి మంట వేశారు. ముందుగానే చేసి ఉంచిన భోగి దండలు మనుమలు చేత వేయించి, భోగి మంట లో దిష్టి తీసింది ప్రభావతి. ఇద్దరు మనుమరాళ్ళ చేత సాయంత్రం గొబ్బిల్లు పెట్టించింది. పేరంటాల్లు తో “గొబ్బీ యల్లో గొబ్బీ యల్లో” అంటూ గొబ్బెమ్మ పాటలతో ఒక వైపు, చిన్న మనుమడు కి రేగి పళ్ళతో భోగి పళ్ళు కార్యక్రమం మరో వైపు, సందడే సందడి. ఉదయమే “అయ్యవారికి దణ్ణం పెట్టు” అంటూ గంగిరెద్దు వాళ్ళు, “హరి లో రంగ హరి”అంటూ కీర్తనలతో హరిదాసులు, బుడబుక్కల వేషధారణ లో కళాకారులు కోలాహలం సరే సరి. సంప్రదాయ బద్దంగా వాళ్ళకి మనుమల చేత చక్కగా సంభావన ఇప్పించి, పాటలు పాడించి దిష్టిలు తీయించారు శర్మ గారు. భోగినాడు వియ్యాల వారు కూడా ఇక్కడే ఉండేలా ప్రణాళిక చేసుకుంటారు. అమ్మాయి అత్త వారు కొంచెం దూరమే అయినా, అబ్బాయి అత్త గార్లు దగ్గర్లోనే ఉంటారు.
మిగతా ఏ పండుగలు ఎవరింట్లో ఎలా జరిగినా సంక్రాంతి మాత్రం ఇక్కడే. వారికీ వీరికీ అదే ఇష్టం. ఇంత మంది తో భోజనాల హడావిడి వేరే చెప్పాలా. ఎన్ని పిండి వంటలు అబ్బా పొట్ట చెక్కలయ్యేలా ఉంటాయి. పల్లె వాతావరణం కావడం తో అసలు ఆ సందడే వేరు. అలా గడిచింది భోగి.
ఇక మరునాడు సంక్రాంతి. తింటే మీ చేతి బూరెలు తినాలి అనే వారు ఒకరు, అత్తయ్య ఇది ఎలా చెయ్యాలి, అత్తయ్య అది ఏమి చెయ్యను అంటూ కోడళ్ళు. పిన్నీ నిజంగా అమ్మ లాగే చూసుకుంటావూ నన్ను అంటూ అమ్మాయి కబుర్లే కబుర్లు. ఆ రోజంతా ఇంట్లోనే అవీ ఇవీ చెప్పుకుంటూ, తేనె పానకం తో బాటు దిబ్బరొట్టెలు, ఉదయమే జీడిపప్పు ఉప్మా తో బాటు కొబ్బరి పచ్చడి. అన్నీ సంప్రదాయ వంటలే. పిల్లల కేరింతలకి హద్దే ఉండదు. రాత్రి ఎంత పొద్దు పోయినా అలుపే ఉండదు. ఉదయం ఐదు గంటలకే లేచి సందడి చేస్తారు అంతా. కొత్త బట్టలు వేసుకుని శివాలయం, విష్ణాలయం తో బాటు అమ్మ వారి గుళ్ళు దర్శించుకుని పూజలు చేస్తారు. ఇంటికి రాగానే వేద పఠనం చేయించి, వేద విద్యార్థులకు సంతృప్తి గా భోజనాది సత్కారాలు చేస్తారు. అందరికీ ముందే తమకు నచ్చిన బట్టలు కొనుక్కో మని డబ్బులు పంపిస్తారు. దానితో బాటు అందరికీ ఎంతో కొంత బంగారం కొని కానుక ఇవ్వడం వీరి అలవాటు. అల్లుడు, కోడళ్ళు సమానమే ఈ విషయంలో. అలా ఇచ్చిన బంగారం తో ఓ నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక ఆభరణం చేయించమని వీరికే ఇస్తారు పిల్లలు. ఆ ఆభరణాలు ఇప్పుడే తయారవుతాయి. అలా పెద్ద పండుగ పూర్తి అవుతుంది.
ఇక కనుమ నాడు పక్కనే జగ్గన్నతోట లో “హా శరభ శరభ” అంటూ ప్రభల తీర్థం పెద్ద ముచ్చట. కోడి పందాలు కి గోదావరి జిల్లా కి ఉండే అనుబంధం తెలుసు కదా. ఓ పూట అంతా దానికే సరిపోతుంది. గార్లు ఆ రోజు ప్రత్యేక వంటకం. కనుమ నాడు మినుము తినాలని సంప్రదాయం కదా. సాయంత్రం ఆడవాళ్ళు అంతా కలిసి వాకిట నిండా రథం ముగ్గు వేస్తారు. రోజూ వేసే రంగవల్లులు ఒక ఎత్తు అయితే ఈ రంగుల రథం ముగ్గు ఒక ఎత్తు. ఊరంతా పోటీ పడి ఒకరి రథం తాడు ఇంకొకరు అందుకుని ఊరు దాటిస్తారు.
ఇంకా, ఎద్దుల బండ్ల ఊరేగింపులు, కొన్ని గాలి పటాల కేరింతలు, నాగలి పూజలు ఇవన్నీ ఊరులో సంబరాలు.
అసలు ఇంత ఆనందంగా సాగే సంక్రాంతి ఇలా పల్లె పట్టున చేసుకోవడం ఎంతో అదృష్టం. అందుకే ఎవ్వరూ దీనిని తప్పిపోకుండా చూసుకుంటారు.
ఇక ఆ మరునాడు ముక్కనుమ మామూలు హడావిడి తో బాటు తిరుగు ప్రయాణాలు, బట్టలు, నిల్వ పిండి వంటలు అవీ సర్దుకోవడం అంటూ ఒక వైపు అప్పుడే వెళ్ళాలా అనే దిగులు మరో వైపు. ఎంత అవినాభావ బంధాలు పెనవేసుకు పోయినా పిల్లల్ని భాద్యత వైపు నడవాలని, దృఢంగా ఉండాలని పెంచారు. అందుచేత అంత పెద్ద ఇబ్బంది ఉండదు వారికి. పిల్లలంతా వీరిరువురి దగ్గరా ఏడాది కి సరిపడా సలహాలను తీసుకుని వీలుని బట్టి ఆ మరునాడు, ఏవైనా సెలవు దినాలు అయితే ఇంకో రోజు ఆగి అందరూ బయలు దేరుతారు.
అదండీ మన శర్మ గారి మరియు పొట్టి అయ్యో కాదు ప్రభావతి గారి సంక్రాంతి సందడి. మరి వచ్చే ఏడాది నుంచి మనమూ అక్కడకే వెళ్దామా!

—–

You May Also Like

85 thoughts on “శర్మ గారింట్లో సంక్రాంతి (సంక్రాంతి కథల పోటీ)

 1. కాసేపు మేమూ శర్మ గారింటికి వెళ్ళి పండుగ సంబరాల్లో పాల్గొని ఆనందించాం. చాలా బాగుంది అన్నయ్యా. సూపర్.

 2. శుభోదయం.చాలా చక్కని సంక్రాంతి సంబరాలు అప్పటికి ఇలానే కొనసాగాలి ఈ సాంప్రదాయాలు …తరతరాలుగా …చక్కని కథ padman

 3. Naa chinnappati rojulalo, Konaseema lo Sankranthi panduga idhe vidham ga jarupukunevallamu. Sankranthi panduga lo jarige visheshalu ippati generation ki sarigga theliyadu. Eee kadha chadive vallaki, Sankranthi panduga ila chesukune valla ani thelusukuntaru. Eee kadha lo anni vishayalanu chala baga chepparu. Okka sari time travel lo oka 4 decades venakki vellipoyanu. naku enno madhuramaina jnapakalani ichindhi. Very nice narration Padmanabha Rao garu.

 4. Very nice narration Padman.
  I enjoyed reading it. And felt I am also one of the family member there enjoying with them.
  Great writing.

 5. Never been to Konaseema for Sankranti….but felt like experiencing the same in person…Very well expressed and written….

 6. చాలా బాగుంది కథ కానీ అచ్చు జరిగిన nd జరగబోయే సంక్రాంతి తలపించింది అన్నయ్యగారు… అంతర్లినంగా మీ కుటుంబం మున్ముందు సంక్రాంతి లా అనిపించింది… Wsh u all d best🙏💐అన్నయ్య garu

 7. చాలా బాగుంది. సరిగ్గా నెల రోజుల ముందే సంక్రాంతిని తెచ్చేశారు.

 8. మనం క్రమంగా మరిచి పోతున్న సంబరాలు ఆత్మీయతలు బాగా గుర్తు చేశారు. అభినందనలు.

 9. పల్లెటూరి సంక్రాంతి సంబరాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది కథ చాలా బాగుంది

 10. సంక్రాంతి పండుగ కళ్లకు కట్టినట్టు చూపించారు ,చాల చక్కగా వ్రాసారు
  కథ.

 11. చాలా బాగుంది. ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది.

 12. చాలా బాగుంది మామయ్య .. 👌 🤩 కథ చదువుతున్నంతసేపు పండుగకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళి సందడి చేసిన రోజులు గుర్తుకువచ్చాయి. ఆరోజులే బాగుండేవి.. అందరూ కలుసుకునేవాళ్ళం.. ఇప్పుడు ఎవరికి వారు బిజీ బిజీ అయిపోయారు..

 13. చాలా బాగుంది. చదువరులకు హాయిగా, సంక్రాంతి జరుపుకుంటున్న ఫీల్ వచ్చింది

  1. పండగలాగే ఉందండీ
   సాంప్రదాయ బద్దంగా 😊

   మీ రహస్యo ఒకటి మాకు తెలుసిపోయింది 😍

   1. పల్లెటూరి సంక్రాంతి సంబరాలని బాగా వర్ణించారు👌

 14. కథ బాగుందండి..సంక్రాంతి పండగ మాత్రం పొట్టిది కాదంటూ బాగా రాసారు.💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!