మనిషి — దయ్యం

మనిషి — దయ్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : యాంబాకం

   అది 1977 అనుకుంటాను నాకు దగ్గర దగ్గరగా 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది. బయట వాతావరణం ఎడతెరిపి లేని వర్షంతోనూ హోరుగాలి తోననూ, మెరుపుల తోనూ, ఉరుముల తోనూ, పిడుగులు పడుతున్న చప్పుళ్ళుతోనూ నానా భీభత్సంగా ఉన్నది. ఆ వర్షానికి మా ముసలిబామ్మ దాని పాత పెంకుటిల్లు ఏ క్షణంలో అయిన కూలిపోయేలా ఉన్నది. ఆ ఇంట్లో పిచ్చయ్య, నల్లయ్య, మల్లయ్య, అనే ముగ్గురు పక్కన పల్లెటూరు వాళ్ళు ఆ రాత్రికి తలదాచుకున్నారు. వారు ఒకరి నొకరు ఎరుగరు ముగ్గురూ ముందు గదిలో చేరారు. వాతావరణాన్ని బట్టి వాళ్ళు దెయ్యాలను గురించి మాట్లాడుకో సాగారు. పిచ్చయ్య తనకు కలిగిన దెయ్యాల అనుభవం గురించి ఇలా చెప్పాడు.
“నేను పోలం పని మీద టౌన్ కేళ్ళి ఊళ్ళ వెంట తిరుగుతున్న రోజూ ఒక రోజు తొందరగా టౌన్ కు చేరాలని చీకటితోనే బయలు దేరాను. ఇంట్లో వాళ్ళు ఆపాలని చూసారు. దారిలో వల్లకాట్లో చింతచెట్టు మీద చీమ చింతకాయల చెట్టు పైనా ఒక దెయ్యం చేరిందని అటుగా వెళ్ళే వాళ్ళని పట్టి పీడిస్తుందని అన్నారు. అయితే నాకు అది పెద్దగా చెవిన పడలేదు. నేను చీకటిలోనే టౌన్ కు బయలుదేరాను. వల్లకాడు దగ్గరకు రాగానే గుడ్లగూబల అరుపులూ నక్కల ఊళలూ వినిపించాయి. నేను చింతచెట్లు చేరేసరికి గుబురుగా ఉన్న పొదలు కదిలాయి నాకు కొంచెం భయం వేసింది. కొమ్మల మధ్య తెల్ల, తెల్లగా కనిపిస్తూ ఉంది. దెయ్యం కాబోలు,” ఇంతలో “ఎవరువారు? ఎంతధైర్యం నా వైపు రావడానికి”?అని భీకరంగా అరిచింది. నాకు ముచ్చమటలు పోశాయి తడిచి పోయినంత పని అయినా ధైర్యం తెచ్చుకుని “నేనూ ఒక దయ్యాన్నిలే!అన్నాను. కొమ్మల్లో నుంచి వెర్రికేక వినిపించింది. దభీమని చెట్టు మీద నుంచి ఎవరో కింద పడ్డారు. నాకు అంతా అర్థమయింది. వాడు ఏదో దెయ్యంలా నటించి అందరినీ భయపెడుతున్నాడని! వాడు ఇలా రాత్రిపూట బహిర్భూమికి వచ్చే ఆడవారి కోసం అలా చేస్తున్నాడని తెలిసి వాన్ని పట్టుకెళ్ళి ఊళ్లోకి వెళ్ళి ఇదిగో మిమ్మల్ని వేదిస్తున్న దెయ్యం అని జరిగదంతా ఊళ్ళో వాళ్ళుకు చెప్పాను. వాళ్ళు వాడి పీడ విరగడ అయ్యినందుకు సంతోషించి, చందాలు వేసుకోని నాకు కొంత డబ్బు ముట్ట చెప్పారు.
నల్లయ్య తన అనుభవాన్ని ఇలా చెప్పాడు:
“నేను కొబ్బరి బోండాలు మా ఊరి నుంచి టౌన్ కి తీసుకెళ్ళి అమ్ముకోవడానికి ఒక పాత ఇల్లు వెతికితే ఒక పాడుపడిన పెంకుటిల్లు దొరికింది. అది దెయ్యాల కొంప అని చెప్పుకొనేవారు. నేను ఎముంది పగలు అమ్ముకొని వెళ్ళేదే కదా! అని భయపడ లేదు. సరే అలా చేరిన తరువాత ఒక రోజు వ్యాపారం లేట్ అయింది ఆ ఇంట్లో ఉండటానికి నిశ్చయించు కొని ఆ రాత్రి భోజనం చేసి ముందు గది శుభ్రం చేసి లోపల గడియ పెట్టి నిశ్చితంగా నిద్రపోయానూ, ఒక మిడి రాత్రి అలికిడికి మెలకువ వచ్చింది. ఇల్లంతా రకరకాల చప్పుల్లు లోపల గజ్జలమోత! తల తిప్పి చూస్తే ఏవో నీడలు కదలడం కనబడింది. ముందు భయం వేసింది. అందులో కొత్త ఎవరూ తెలిసిన వారు లేరు. అక్కడ నుంచి అంత రాత్రి బయట వచ్చేద్దాం అంటే సరుకు అమ్మిన డబ్బులు చేతిలో ఉన్నాయి. అసలు భయం తెలియని నాకే అర్జెంటు అయిపోయింది. కాస్త ధైర్యం తెచ్చుకొని పరిశీలనగా చూస్తే చెట్ల కొమ్మల నీడలు వెన్నెలలో లోపల బడి కదులుతున్నాయి. ఇంకాస్త ధైర్యం తెచ్చుకొని లోపల గదిలోకి పోయిచూస్తే వందల కొద్దీ ఎలుకలు! అవి వీర విహారం చేస్తున్నా చప్పుల్లే నాకు వినిపించింది ‌ నన్ను చూడగానే ఒక పెంపుడు పిల్లి మ్యామ్ అని అరచి కిటికీలోనుంచి పారిపోతూ ఉంది. దానికి కాళ్ళకి గజ్జలు కట్టి ఉంది. అసలు నాకు అప్పుడు భయం తగ్గి అప్పుడు అనిపించింది. దెయ్యాలు లేవు, భూతాలు లేవు అంతభ్రమ అని”.
మల్లయ్య తను ఒక అనుభవం చెప్పాడు:
“నేను మా ఇంటికి తాటాకులు కోయడానికి పోతా ఉంటే మా ఊరి పొలిమేరలో ఉండే ఒక ఇంటి ముందు చాల మంది మూగి ఉండటం చూశాను ఆ ఇంట్లో ఒక ఎదిగిన అమ్మాయికి దెయ్యం పూనిందంట అని భూత వైద్యున్ని పిలవ మంటున్నారు. నాకు చూడాలనిపించి లోనికి పోయా ఆ పిల్ల పెనుభూతంలా గోళ్ళతో రక్కింది.  నా లుంగి కూడ చినిగి పోయింది. అరిచి గోల చేస్తుంది. నాకు అది కావాలి ఇది కావాలి నేను కాటేరుని ఈ పిల్లని చంపేష్తా అని చెప్పడం చేయ సాగింది. అందరూ ఇదిగో నాయన నీకు ఎందుకు నీవు బయటకు వచ్చేయి అది మామూలు దెయ్యం కాదు అని అనేసరికి నాకు కొపం వచ్చి ఆపిల్లని పక్కగదిలోకి తీసుకుపోయి చెంపమీద చాచి కొట్టి చెప్పు? ఈ దొంగ నాటకాలు ఎందుకు చేస్తున్నారు! చెప్పక పోతే నీ కీళ్ళును విరిచేస్తా అని బెదిరించే సరికి ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ “నటించక ఏం చెయ్యను నా సవతి తల్లి నన్ను రాచి రంపాన పెట్టుతున్నది. ఇప్పుడు నన్ను ఒక జ‌బ్బు ఉన్న ముసలోడికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని చూస్తుంది. ఈ పెళ్లి తప్పి పోవడానికి ఈ నాటకం ఆడుతున్నాను అన్నది. ఆమె మీద చెయ్యి చేసుకున్నందుకు బాధపడి ఆమెకు మంచి వాళ్ళ సంబంధం చూసి పెళ్ళి చేయమని అందరితో చెప్పించాను. దెయ్యాలు పూనడం వొట్టి బూటకం అసలు దెయ్యాలు ఉంటే కదా! పూనడానికి?
అంతే బయట వర్షం నిలిచి పోయింది ముగ్గురు వెళ్ళిపోయారు కానీ వాళ్ళ కథలు విని నాకు ఇప్పటికీ దెయ్యాలు అంటే భయం ఇంత వరకు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేను ఒంటరిగా రాత్రిల్లో పొడుకొని ఎరుగను ఇదే నేను మరచిపోలేని జ్ఞాపకాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!