నా పయనం

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

నా పయనం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: క్రాంతి కుమార్

ఏడుపుతో మొదలైన
ఈ జీవిత ప్రయాణంలో
అమ్మ పిలుపుతో నేర్చుకున్న భాష
నాన్న కష్టాన్ని చూస్తూ పెరిగిన వయస్సు
తోబుట్టువులతో గడచిన బాల్యం
స్నేహితులతో పెరిగిన చిలిపి అల్లరి
పుస్తకాలతో మొదలైన అక్షర జ్ఞానం
కష్టాలలో నిలబెట్టిన కఠిన విలువలు
ఉద్యోగ వేటలో తెలుసుకున్న లోకం పోకడ
గెలుపు బాటలో నడిపించిన వ్యక్తిత్వం
ఓటమిలో తారసపడిన ఆత్మీయ అనుబంధం
ప్రియురాలి కోసం మొదలైన కవిత కుసుమం
ప్రాణనేస్తం కొరకు ఎదురుచూస్తున్న మది
ఒక్క అడుగుతో ప్రారంభమైన
ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో
వేల అనుభూతుల స్మృతుల సవ్వడితో
మదిలో నిశ్శబ్దంగా మౌనరాగం వింటూ
సాగిపోతున్నది నా పయనం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!