జీవిత చక్రం

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

జీవిత చక్రం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

జీవితమనే కాలచక్రంలో
వెనుతిరిగి చూస్తే ఎన్నో
మరపురాని సంఘటనలు
మరచిపోలేని సన్నివేశాలు
ఆ స్మృతులు తలచుకుంటే
సంతోషాన్నిచ్చేవి కొన్ని
బాధని పెంచేవి కొన్ని
మది నిండిన నిశ్శబ్దంలో
ఆ జ్ఞాపకాలు చేసే సవ్వడులతో
గతమంతా మన మంచికే అనుకుంటూ
గతం నేర్పిన పాఠాలను వల్లె వేసుకుంటూ
భవిష్యత్తు కోసం పాటు పడుతూ
ప్రతిరోజూ ఆనందంగా గడుపుదాం
మనచుట్టూ సంతోషాలను పంచుదాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!