ప్రకృతి సోయగం

ప్రకృతి సోయగం

విజయ మలవతు

వెండి మబ్బులతో కాలాన్ని బంధించి
చల్లని చిరుగాలుల సోయగంలో
చిరు చినుకుల జల్లులలో
మధురమైన మట్టి సుగంధంతో
పురివిప్పిన నెమలి వలే మురిసెను మది
చిరుజల్లులలో తడవాలి అని ఆశగా
పచ్చని తోరణమే శుభశకునంగా
వరుణదేవుడికి ఆహ్వానం పలుకుతూ
మదిలో తియ్యని ఊహలతో
చిలిపి సరదాలతో
కాగితం పడవలలాంటి
మధురస్మృతులను
జ్ఞప్తికి తెచ్చుకుంటూ
ఆహ్లాదకరమైన ప్రకృతి సొబగులతో
తూనిగల జుంకారంతో
మధురమైన సంధ్యవేళలో
స్వచ్ఛమైన మనసుతో సేదతీరుతూ
ప్రకృతికాంతనై
ఇంద్రధనస్సుతో ఆటలాడాలని ఆశ…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!