సప్తవర్ణాల శోభితం

సప్తవర్ణాల శోభితం

రచన: సుశీల రమేష్

నీలి అంబరమున అనూహ్యమైన
అందాన్ని ప్రకృతి గీసిన సప్తవర్ణాల శోభితం  ఈ ఇంద్రధనస్సు.!
ఇది ధరణి రెండంచులను కలిపే వంతెనయా,లేక అధిక వర్షపాతం
ముగిసినది అని తెలుపుటకు ఆకాశము పంపిన సందేశమా !
పడతి జీవితమును కూడా
ప్రభావితం చేస్తాయి ఈ సప్తవర్ణాలు
వివాహ సమయమున పసుపు కుంకుమలు, తొలిరేయి నాడు తెల్లని మనసు తోడు, చిలక పచ్చని కాపురం లోని సిరి సంపదలు, మేళవింపు ఈ సప్త వర్ణముల సుందర సుమనోహర ఇంద్రధనస్సు వంటిది మగువ జీవితం.
ఉరికే యవ్వనానికి ప్రతీక గా
చెప్పవచ్చును సప్తవర్ణాల శోభిత ఇంద్రధనస్సును……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!