దేవులాడుతున్నానయ్యా

(అంశం: “ఏడ తానున్నాడో”)

దేవులాడుతున్నానయ్యా

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

ఏడ నీవు వున్నావోనని, ఏదో
చేస్తావని దేవయ్యా రామయ్యా
నీకోసం దేవులాడుతున్నానయ్యా;

నీ వున్నతనం, హుందాతనం,
ఎప్పటికీ కోల్పోని చిరునగవుల
నీ సహన మూర్తిమత్వం సాంతం
చేస్తావని దేవయ్యా రామయ్యా
నీకోసం దేవులాడుతున్నానయ్యా;

నీ ధర్మాచరణ, సత్యసంధతతో
శ్రేయస్సును కోరే నీ వ్యక్తిత్వం
ఇప్పటి నాయకులకు సొంతం
చేస్తావని దేవయ్యా రామయ్యా
నీకోసం దేవులాడుతున్నానయ్యా;

రామ అంటే అనురాగానికి మారు,
నీ ప్రేమామృతంతో సమాజాన్ని
మంచి ఆలోచనలు నింపేలా
చేస్తావని దేవయ్యా రామయ్యా
నీకోసం దేవులాడుతున్నానయ్యా;

ఏడ తానున్నాడో రామయ్య అని
అంతటా వున్నావని తెలిసినా,
అంతా వెతికినానయ్యా దేవయ్యా,
ఎక్కడా నాకు కాన రావేమయ్యా
ఆదర్శ మూర్తివైన ఓ రామయ్యా
నీకోసం దేవులాడుతున్నానయ్యా;

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!