ఎక్కడున్నా రావాలే!

(అంశం: “ఏడ తానున్నాడో”)

ఎక్కడున్నా రావాలే!

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

చుట్టూ చీకట్లు అలముకుంటున్నాయి
ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి
ఆందోళనలు మితిమీరుతున్నాయి
అలజడులు పెరుగుతున్నాయి
ఏడ తానున్ళాడో ఆర్చితీర్చేవాడు
ఎక్కడున్నా రావాలే!
రాడేమి తాను
తానున్నాడోలేడో
చక్రగదాధారుడే రానక్కర్లేదు
త్రీశూలధారుడే రానవసరంలేదు
మానవత్వమున్న మనిషైతేచాలు
కండబలం గుండెబలమున్నవాడైతే చాలు
వందమందో వేలమందో రానక్కర్లేదు
ఒక్కడు ఒకే ఒక్కడుచాలు
ఈ అరాచకాలను అంమందించడానికి
ఈ అన్యాయాలకు ఆపడానికి
ఈ అత్యాచారపర్వాలను అడ్డుకోవడానికి
ఏడ తానున్నాడో
ఎక్కడున్నా రావాలే !

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!