పసిప్రాయం

పసిప్రాయం 

రచన::సౌజన్య ‘ చేతన ‘

కిల కిల నవ్వుల చిన్నారుల పసి ముఖాలలో కళ కళలు చెదిరి వెల వెల వాడెను ఎందుకో..?
దారి తప్పిన దాపరికాల ముసుగులో దాంపత్యాలు
అలమరికల దూరాలలో ఆలుమగల
అపార్థాల కీచులాటలు
విడాకులతో తెంచుకున్న అనుబంధాలు ఎవరికి వారే వేరయ్యి గూడు చెల్లాచెదురై చెట్టుకొకరు పుట్టకొకరైరీ
అన్నెం పున్నెం ఎరుగని పసి కూనల ఆలనా పాలనా మరిచిన చేత
విసిరి వేయబడ్డ పసిబిడ్డల జీవితాలు ఇలా గంగపాలు

కన్నఒడిలో లాలన కరువై కలవరం చెంది కడలి అంచుకు చేరిన పసిప్రాయం
బాతుల వలె మారి కనికరం లేని కాలంతో ఎదురీద చేతగాక నిర్వేదపు (క)నీటిచెరలో నిస్సహాయంగా నిలబడెను చూడు మనసు చిన్న బుచ్చుకుని బుడతలు

జాలీ లేని రాతి గుండెలు పసి కాళ్ళకు బంధనాల కళ్ళాలు వేసెను
తూనీగలల్లే వారిని స్వేచ్ఛగా నింగిన ఎగరనియ్యక..,చిన్ని ఆశలు నింగిదాటి ఎదగనియ్యక.. చిదిమేసేను…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!