అంశం: చీకటి వెలుగులు
వెలుగు విలువ తెలుస్తది
రచన: సంజన కృతజ్ఞ
వెలుగు అందాలు చూపుతున్న
చిమ్మ చీకటి
రాగాల కమ్మదనం వినిపిస్తున్న
కఠోర నిశ్శబ్దం
జీవిత సత్యాన్ని వివరిస్తున్న
ఒంటరితనం
చీకటంటే నా కిష్టం
మెలుగొస్తుందని ఆశ
వెలుతురంటే నాకు భయం
చీకటిప్పుడు కమ్మేస్తుందోనని
అనుమానం…
చీకటి మంచిదే
వెలుగు విలువను చూపెడుతుంది..
మితం మంచిదే
అతిలో మతిని మందలిస్తుంది..
వెలుగున్న ప్రతి చోట చీకటి ఉంటుంది
వెలుగులో నిద్రపోతూ చీకటిలో వెతుకులాడకు
సమయం నీ కోసం ఆగదు…