నిద్దుర రాని నిశి రాతిరి ఇది

అంశం : నిశి రాతిరి

నిద్దుర రాని నిశి రాతిరి ఇది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కార్తీక్ నేతి

నిద్దుర రాని నిశి రాతిరి ఇది,
ఏవేవో ఆలోచనలు పిడుగులై వేదిస్తున్నాయి,
పిరికితనం మెరుపులై బయపెడుతున్నాయి
ఓటములన్ని కట్టగట్టుకొని నిరుత్సహ వరదలో
ముంచడానికి ప్రయత్నిస్తున్నాయి,
ఎదురు గాలులై వెన్నక్కి లాగుతున్నాయి
జీవతం సంగ్రామం నుండి తప్పుకోమ్మంటూ వెంటపడుతున్నాయి,
అంతర్లీనమైన అంతరాత్మ అది వేలిసిపోయే వాన,
అదరక బెదరక ఎదురు దైర్యాన్ని గొడుగు చేసుకొని ఎదురు నిలబడు,
ఏమాత్రం తలవంచకు ప్రయత్ననాన్ని విరమించకు,
ప్రాణం ఉన్నంత వరకు పోరాడడం
మానవ ధర్మం అనే విషయాన్ని మరిచిపోకంటూ
మత్తునిద్దురలోకి తీసుకెళ్ళింది
శశి ఎదురయ్యింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!