అంశం: నిశిరాతిరి
కలల తీరం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: గాజులనరసింహ
ఎన్నో కాంతి తళుకుల ఓ నీలి కడలి ఆకాశం ఆ ఆకాశం
అది ఒక్కసారి దుప్పటేస్తే లోకమంతా చీకటి
ఆ చీకటి ఎన్నో మధురానుభూతులకు సంపుటి అవుతుంది
సుమసుందర పరిమళాలతో నిశీధి మనసును నిలువనీదు
ఆశల ఒత్తిడితో పురమాయిస్తూ ముందుకు నెట్టుతుంది
వెన్నెల దీపాలు వేచి చూస్తూ ఉంటాయి నెలరాజుకోసం
పడుచు పరువాలు ఎన్నో యుగళ గీతాలు అలపిస్తూ ఉంటాయి
అణువణువు తడుముతూ అడుగడుగులో
ప్రశాంత పరిచయాలు ఎన్నో జరుగుతాయి
సడిిలేని సంధుల్లో సద్దుమనుగుతూ జీవులెన్నో..
తమ కలలతీరానికి బాటలు వేస్తుంటాయి
సేదతీరుతూ అలుపును సడులుపుతూ …
నులివెచ్చని హాయిలో కూనిరాగలు తీస్తూ ..
తీపిరుచుల వలపుసెగలో చలికాసుకుంటూ ..
నాటి జ్ఞాపకాలను నెమురు వేస్తూ
కొత్త జ్ఞాపకాలకు ఆహ్వానం పలుకుతూ ..
నిదరోవమ్మా నిదరోవమ్మా అని అంటుంది నిశీధి ..