స్వార్థం

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

స్వార్థం

రచయిత :: ఎన్.ధనలక్ష్మీ


విద్య నుంచి వైద్యం వరకు
ఆహారం నుంచి మంచి నీళ్ళ వరకు
అడుగడుగున స్వార్థం..

గవర్నమెంట్ నుండి ప్రైవేట్ వరకు
చిరు సంస్థలు నుంచి పెద్ద కర్మాగారాల వరకు
ఎక్కడ చూసినా స్వార్థం..

స్వదేశం నుంచి విదేశాల వరకు
నూనె నుంచి చల్లని పానీయాలు వరకు
ప్రతి చోటా కల్తీ డబ్బు సంపాదించాలనే స్వార్థం

ప్రతిదీ డబ్బులకు అమ్ముకుంటున్నారు
ఎక్కడుంది మానవత్వం….ఎక్కడో నూటికొక్కరు
మానవత్వంతో ఉంటూ సాటి మనిషికి సాయం ఏం చేస్తున్నారు ???
ఒక వేళ చేసిన ఆ సాయం వెనుక తెలియని కుట్రలు ఎన్నో…

సాయం పేరు చెప్పి దోచుకునే దళారులు ఎంతమందో వారిని నడిపించే నాయకులు మరెందరో!!
కంటి ముందు ప్రాణం పోతున్న కరగని కఠినాత్ములు ఎంతమందో ఉన్నారు …
వారికి ప్రతిదీ వ్యాపారమే !!!!… ప్రతి దానిలో లాభాపేక్షను ఆశిస్తారు.
మార్పు ఎవరిలో ఎందుకు కోరుకోవాలి…అది మన ఇంటి నుంచి మొదలు పెడదాము…

You May Also Like

One thought on “స్వార్థం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!