జగన్మాత(నవదుర్గ)

జగన్మాత(నవదుర్గ)

రచన : స్రవంతి

సకల శక్తి స్వరూపిణి..
సకల సద్గుణ ప్రదాయిని..
ఆది పరాశక్తి… దుర్గామాత
నిను కొలిచినా పది జన్మల పాపాలు హరించును…
నవరాత్రులలో కొలువై ఉండు నీదు రూపం….

శైలపుత్రి వై సకల శక్తులను, యశస్సును ప్రసాదించేదవు.
బాలా త్రిపుర సుందరివై సత్సంతానాన్ని అనుగ్రహిస్తావు..
వేద స్వరూపిణి ధవళ వర్ణాలతో కొలువైన గాయత్రిదేవివై జ్ఞానాన్ని ప్రసాదిస్తావు..
లలితాదేవి రూపమై మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తావు..
శ్వేత పద్మాసనా సరస్వతివై బుద్ధి, విద్యా జ్ఞానం ప్రసాదిస్తావు..
అన్నపూర్ణాదేవివై ధనధాన్య వృద్ధి కలిగించి, ఐశ్వర్యసిద్ధిని ప్రసాదిస్తావు..
అష్టలక్ష్ముల సమిష్టి రూపమై అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తావు..
దుర్గతులను నివారించే పరాశక్తి వై మోక్షాన్ని ప్రసాదిస్తావు…
మహోగ్ర రూపమైన మహిషాసురమర్దినివై భయమును తొలగించి, సర్వ కార్యాల్లో విజయం ప్రసాదిస్తావు…
ఆది పరాశక్తి సకలజనులను అనుగ్రహించు మాత.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!