మర మనుషులు

మర మనుషులు

రచయిత: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్)

సరైన గమనం లేని గమ్యాలు ఎందుకో
ఆచరణలో లేని సామాజిక విలువలు ఎందుకో
నిజాయితీ లేని బంధాలు బంధుత్వాలు ఎందుకో
నమ్మకం లేని ప్రేమలు పెళ్ళిళ్ళు ఎందుకో

ఆలోచన చేయని పదవులు పదోన్నతులు ఎందుకో
పరిష్కారం చూపించలేని అధికారాలు ఎందుకో
ధైర్యం లేని పోరాటాలు ఆరాటాలు ఎందుకో
ప్రయత్నించలేని బలాలు బలగాలు ఎందుకో

అన్యాయాలను ఎదిరించలేని ఆవేశాలు ఎందుకో
అక్రమాలను అడ్డుకోలేని కోపాలు ఎందుకో
తప్పులను ప్రశ్నించని మూగ బ్రతుకులు ఎందుకో
బానిస సంకెళ్ళను తెంచుకోని జీవితాలు ఎందుకో

హృదయం లేని మరమనిషిలా జీవించేందుకా
మార్పురాని మూర్ఖపు మనిషిలా శాసించేందుకా
ఎడారిలో కురిసే వర్షంలా వృథా అయ్యేందుకా
అడవిలో కాచే వెన్నెలలా మిగిలి పోయేందుకా…

You May Also Like

6 thoughts on “మర మనుషులు

    1. థ్యాంక్స్ 🤗 అనురాధ గారు

  1. చాలా బాగుందాండి క్రాంతి గారు👍

    1. థ్యాంక్స్ 🤗 అండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!