స్వర జ్ఞానము

స్వర జ్ఞానము
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

సూర్యోదయంతో పాటు లేచి గబగబా తెమిలి కాలేజీకి వెళ్ళింది. ట్రైనింగ్ కోర్స్ లో చేరింది.
టి.టి.సి అయితే నలబై రోజులు అదే. బి.ఈడీ అయితే తొమ్మిది నెలలు ట్రైనింగ్ అవ్వాలి. అది కాక స్కూల్స్ కి వెళ్లి పాఠాలు చెప్పాలి. అక్కడి స్టాఫ్ నీ ఇంప్రెస్స్ చెయ్యాలి హెడ్ మాస్టర్కి కూడా ఇంప్రెస్స్ చేయాలి, పర్మిషన్స్ అడగాలి.. ఇవన్నీ నచ్చవు అందుకే బి.ఈడీ వద్దు అనుకున్నది. కానీ ఇప్పుడు మ్యూజిక్ పిజి ఉన్నా, సరే ట్రైనింగ్ అవసరం అంటారేమో అనే భయంతో చేరింది భూమిక. కానీ అక్కడ హాస్టల్ లేదు. ఆ ట్రైనింగ్ సెంటర్ దగ్గర భోజన హోటల్ లేదు. అందరూ కూడా ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చిన, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి అందరూ వచ్చినా, ఆ తూర్పూ గోదావరి జిల్లాలోనే సంగీత కళాశాల ఉన్నది. అందులో డ్రాయింగ్ ఇంకా విభిన్న శాఖల వారు ఉన్నారు. అందరూ కూడా దగ్గర బంధువులు దూరం బంధువులు స్నేహితులు ఇళ్లదగ్గర ఉన్నారు.
ఆరు గంటలకి, అంతా బయలుదేరితే గానీ, ఎనిమిది లోపల ట్రైనింగ్ సెంటర్ కి చేరలేరు. భూమిక ఉన్న ఇంటి నుంచి రిక్షాకి నలబైరూపాయలు. ఆటోకి అరవై రూపాయలు, అదే సిటీబస్ అయితే పది రూపాయలు చార్జీ. డబ్బు చాలా భాగం వీటికే ఖర్చు, అక్కడ తినడానికి ఏమి ఉండదు. అరకిలో మీటర్ వెడితే గానీ, భోజనం, టిఫిన్ హోటల్ లేదు. ఒక ఫర్లాంగు దూరంలో మాత్రం చపాతీ హోటల్ ఉన్నది. అక్కడ ఇడ్లీ ఉదయం ఎనిమిది వరకే, దోసె పది వరకే దొరుకు తాయి. ఆ డబ్బ హోటల్లో చల్లగా గట్టిగా ఉన్న చపాతీ మాత్రమే దిక్కు. ఉదయం వంట పూర్తికాదు సొంత ఇల్లు కాదు, వండే మనిషి ఎనిమిదికి కానీ రాడు. రాత్రి అన్నం తిని, బాక్స్ లో పెరుగు వేసి పెట్టుకుని వెడదమంటటే అటువంటి అలవాటు లేదు. వేడి వేడి అన్నం కంచంలో కుమ్మరించుకుని తినడమే అలవాటు. అంతా సున్నితంగా పద్దతిగా పెరిగింది. ఈ చదువు అవసరమా? ఉద్యోగం చెయ్యాలా ఊళ్ళు ఎలాలా అనుకున్నది. కాలేజ్ ఎదురుగా మాత్రం ఓ చెరుకు రసం బండి ఉంటుంది. ఆ చెరుకు రసం తాగి హోటల్ కి వెళ్లి చపాతీ తిని కాలేజ్ కి వెళ్లి, వర్క్ పూర్తి అయ్యేటప్పటికి సాయంత్రం అవడం.
చెరుకు రసం తాగి ఇంటికి వెళ్ళడం, రాత్రి మాత్రమే భోజనం అది కూడా సంతృప్తిగా ఉండేది కాదు.
ఏమిటో తప్పదు ఈ నలబై రోజులు. ఒక్కొక్క రోజు లెక్క పెట్టుకుంటు జీవితానికి ఈ పరిస్తితి ఏమిటి?
క్లాస్ కి ఆలస్యంగా వెళ్ళింది. ఏమిటో ఇష్టం లేకపోయినా ఈ ట్రైనింగ్ అనుకున్నది.
“మై ఐ కమిన్ సర్” అన్నది వీణా బాధ లాంటి గళంతో, “రా..రా” అన్నారు ఓ అరవై ఏళ్ల పెద్దాయన, పంచే కట్టు జరీ కండువా విభూది రేఖలతో ఉన్నారు.
భూమిక వెళ్లి సీట్లో కూర్చుంది. క్లాస్ కి అంతా వచ్చాక అటెండెన్స్ మొదలు పెట్టారు. ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నారు.
భూమిక వంతు వచ్చి చెప్పింది. వెంటనే ఆయన “నువ్వు బాల కూతురివా? నాగరాజు కూతురివా?” అన్నారు.
చాలా ఆశ్చర్య పడింది. “కాదు వాళ్ళు చిన్న అమ్మమ్మలు. ఎంతో కష్ట పడితే గానీ విద్య రాదు. మీ తాతగారు మాకు ఉంచితంగా భోజనం పెట్టి విద్య నేర్పారు. అరుగులే వేద విద్యాలయాలు. అప్పుడు మేము ఆయన మనుమల్ని ఎత్తుకు ఆడించే వారము. అందుకు అడిగాను” అన్నారు.
“కానీ నేను భువనేశ్వరి రెండో కూతురు కూతుర్ని” అని భూమిక చెప్పింది.
ఆ పండిత గ్రామం గురువు విలువ ఆయన ఎంతో గొప్పగా చెప్పారు. ఆ తరువాత అందరూ అయ్యాక “సర్ మీరు ఎలా చెప్పారు” అని అడిగితే,
“నీ గొంతులో మా గురువు గారి ఛాయల ద్వని వినిపించింది. నీ రంగు, నీ గళం కూడా ఆ ఊరిని జ్ఞాపకం చేశాయి. అనువంశకంగా వచ్చింది. సంస్కృత విన్యాసాలు సంగీత మేళవింపుతో ఎంతో మధురంగా ఉంటుంది. స్వర జ్ఞానం అంతా గొప్పది” అన్నారు. ఆయన పిల్లలు అప్సరస మాదిరి ఉండేవారు. అంతా నా అదృష్టం గురువు గారి ముని మనుమరాలికి సంగీత పాటలు నేర్పడం అన్నారు. ఆయన ఎంతో గురు భక్తి ప్రదర్శించారు. ఆ తరువాత కోర్స్ పూర్తి చేసుకుని సర్టిఫికేట్లు పుచ్చుకుని భూమిక బంధువులకు ధన్యవాదాలు చెప్పి వచ్చింది.
భూమిక సొంతగా ఒక మ్యూజిక్ స్కూల్ తో పాటు మల్టీ ఆర్ట్స్ స్కూల్ పెట్టింది. విద్యార్హత ఉండబట్టి ప్రిన్సిపల్ గా ఉన్నది. నానాటి బ్రతుకు నాటకము అన్న శ్రీ అన్నమయ్య, శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనల సారం తెలిసికుంటే జీవితం సుగమనము అవుతుంది. ఎంతో మంది కళాకారులను ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్ది కీర్తి, ప్రతిష్టలు పొందింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!