వేసవి

వేసవి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

మండు వేసవి
ఎండలలో మాడిపోయి,
దినములన్నియు అలసి సొలసి పోయి,
వడగాల్పులబాధకోర్వలేక,
బాధపడుచున్న మనుజుడు,
భాస్కరుని వేడికిరణాల తాకిడికి డస్సిపోయె !
ప్రకృతి చిత్రాల నెన్నగ నెవరి తరము..?
మండు వేసవియైన,
మధ్యాహ్నమైన పవనవీచికలకై ఎదురుచూపు !
సంధ్యవేళల విహార వాహ్యాళి సలుప,
రాత్రులందు గాలికెరటాల పరుపు !
జీవరాసుల భావిభవిత నెంచి, ఋతువులన్నియు
ఒకదానివెంటనొకటి..వచ్చునటుల,
ఉరుములకు ముందు కనిపించు మెరుపుతీగ.
సకల సంపదలనభివృద్ధి జరుగునటుల,
ప్రకృతి వాతావరణము కాపాడవలయు. ప్రాణవాయువు పూల పండ్లనొసగి,
స్వచ్ఛమగు నీరు, గాలి భోజనము గలుగ,
శుభ్రముగ నున్న,
వ్యాధులు సోకకుండు.
ప్రకృతి చిత్రాలనెన్నగ
నెవరితరము ?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!