మధురమైన జ్ఞాపకం

మధురమైన జ్ఞాపకం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎన్.లహరి

అందనంత దూరంలోనే ఉన్నావు
ఏదో తెలియని దగ్గరితనం నీతో నాకు…
కలిసి ఉండలేకున్నా
కనులు మూస్తే కనిపించే నీ రూపంతో
కబుర్లు చెప్తూ…
నాది అన్న ధీమాతో నాలో పూర్తిగా నింపేసుకొని ఊహాలలోనే గడపాలనుంది.
అప్పుడప్పుడు నువ్వు విసిరిన తీపి మాటలన్నీ చుట్టూ చేరి నను మురిపిస్తుంటే…
విరహంలోనే ఆనందముంది…
తీరని కోరికలు అని తెలిసి ఆశలు పెంచి
మదిని గాయపరిచే కంటే…
నాలోనే.. నాతోనే ఉన్నావు అనే భ్రమ బాగుంది…
మనుషులుగా దూరం ఉన్నా..
మన ఆలోచనలతో మనసులు
మాత్రం ఎప్పుడూ దగ్గరే…
ఒక్కసారి గతం వెనక్కి వెళితే ఎంత బాగుండో..
పోనీ నా ఈ రూపాన్ని తిరిగిచ్చిన బాగుండు….
రెండు జరగవు ఆ జ్ఞాపకాలని
నెమరువేసుకోవడం తప్ప…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!