ప్రేమ

ప్రేమ

రచన:దోసపాటి వెంకటరామచంద్రరావు

ప్రేమంటే తెలుసా నీకు
ప్రేమంటే ప్రేమించడమే
ప్రేమంటే ప్రేమించబడడమే
ప్రేమంటే ప్రేమను పంచటమే
ప్రేమంటే ప్రేమలో పడడమే
ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది
ప్రేమ ప్రేమను పెంచుతుంది
ప్రేమ ద్వేషాన్ని కోరదు
ప్రేమ త్యాగాన్ని కోరుతుంది
ప్రేమ శాంతిని పంచుతుంది పెంచుతుంది
ప్రేమ సహనాన్ని కలిగివుంటుంది
ప్రేమ పగను కూడా పంచుతుంది
ప్రేమ దుఃఖాన్ని కలిగిస్తుంది
ప్రేమ సుఖాన్నిస్తుంది
తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్ధం
అన్నదమ్ముల ప్రేమ ఆదర్శం
అక్కాచెల్లెళ్ళప్రేమ అసూయే
స్నేహితులప్రేమ అమరం
ప్రేమికులప్రేమ అజరామరం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!