నాటకాల జగతి

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

నాటకాల జగతి

రచయిత :: జయ కుమారి

నాటకాల జగతి లో
భూటకాల మనుష్యులు మధ్య.
నిత్యం నడయాడుతున్న జీవితాలు మనవి.!!

చూపులో ఉన్నది,మనసున లేనిది.
మనసున ఉన్నది, చూపులో కనిపించనది.
నాటకం.!!

మానవత్వపు ముసుగులో సేవ.
స్వార్ధం ఎంతో నిస్వార్ధం ఎంతో.
తెలియని జంజాటంలో
జరుగుతున్న మోసాలు ఎన్నో.!!

ఆకలి కోసం అలుపెరుగని పోరాటం ఒకరిది.
ధనార్జన కోసం గుప్పెడు మెతుకులు ఎరగా
విసిరే కుతంత్రాలు కొందరివి.!!

మనకి ఉన్న దానిలో
ఆకలి అని అడిగిన వారికి
ఒక ముద్ద అన్నం పెట్టడంలో ఉంది.
అసలైన బోగ భాగ్యాలు.!!

వారి అవసరాన్ని,నిస్సహాయత ను
ఆసరాగా చేసుకుని
మీ స్వలాభం కోసం చేసే
వ్యాపారం ఎంత వరకు సమంజసం.!!

వీలునైనంతలో చేయగలిగితే
సాయం చేద్దాం, మోసం కాదు.!!

You May Also Like

6 thoughts on “నాటకాల జగతి

  1. Jaya నాటకాలజగతి బాగా రాసావమ్మ నీవు ఇంకా మంచి రచనలు చేయాలని మనసార దీవిస్తున్నాను తల్లి. … అమ్మాజీ రత్న కుమారి.

  2. నాటకాల జగతి బాద రాసావమ్మ wishing you all the best For your bright future.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!