(అంశం:”చిత్రం…భళారే విచిత్రం”)
లేరు మీకెవరు సాటి
-ఉండవిల్లి సుజాతా మూర్తి
సిం గిరెడ్డి గారినెలా వర్ణించ
గలనని
జ్ఞాన పీఠానికే వన్నె తెచ్చిన
వారికి వం
గి ప్రణమిల్లుటే గాని వేరేమీ
తెలియదని మ
రె లా వ్రాయుటనే తర్జన భర్జన తో
పరిచయం చూడ
పెక్కు విషయాల వినికిడి తో రే
డ్డి గారంటే దొడ్డ మనసున్న
వారని
దేవతలంతా ఒకవైపు, అమ్మ
ఒకవైపు
నా ఉంటే..నే ఒరిగేను అమ్మ
వైపన్న
వారి మాతృ భక్తికి
మోకరిల్లుదు బాధ్యతా
రా హిత్యం లేని వీరు వేసవిని
మన స్వర్ణ సినీగీతాలకంకిత
పరిచె
ప్రోద్బలులే లేని తానుగా
చదువుకున్న ఆ
య న యవ్వనాన ప్రకృతి
వర్ణన పై
ఆపై మానవీయ దృక్పథం పై
కలం ఝళిపించిన పద్మభూష
ణ సమకాలీనులందరి స్నేహశీలి
కుటుంబం గుండెల్లో వీ
రె విశ్వజనులందరి మదిలో
విశ్వంభరుడె
ముఖానికి ముడతలు
మనసుకు మడతలు
లేవన్న రె
డ్డి గారు “చెలియా కానరావా”
వినేవారు మరి
మనకేల కానరాకుండా
కనుమరుగైనారో
అదేమరి చిత్రం..భళారే విచిత్రం
***