చదువులు మిధ్యేనా?

(అంశము: “ఆన్లైన్ చదువులు”)

చదువులు మిధ్యేనా?

-పిల్లి.హజరత్తయ్య

నెలల తరబడి
నిస్తేజమైన విద్యార్థులను
నిగూఢమైన విద్య వైపు
నాకర్షించడానికి ఉద్భవించిన
నిత్యకృత్యమే ఆన్లైన్ చదువు

నెట్వర్క్ ఇబ్బందులు
నాణ్యతలేని తరగతులు
నూతన డిజిటల్ విధానాలు
నాసిరకమైన చరవాణిలు
నానాఅవస్థలు పడుతున్న విద్యార్థులు

ఆర్థిక అంతరాలు
గ్రామీణ పట్టణ భేదాలు
మారుమూల ప్రాంతనివాసాలు
నిరక్షరాస్యతలు
అయోమయంలో విద్యార్థులు

సరైన పరిష్కారం చూపలేక
సమస్యను పరిష్కరించలేక
సదువులు సాగక
సతమతం అవుతున్న
సర్కారీ పాలకులు

ఆన్లైన్ విద్య అదనపు
బోధనోపకరణాలు మాత్రమే
కాజాలవు ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయాలు
కోవిడ్ నిబంధనలతో తక్షణమే
నిర్వహించాలి పాఠశాలలు

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!