శ్రీరామదూతా! శ్రీహనుమంతా!

శ్రీరామదూతా! శ్రీహనుమంతా!

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

ఆంజనేయస్వామి
అతి పరాక్రమవంతుడు
అంజనీ పుత్రుడతడు
ఆరాధ్యనీయుడతడు

సీతమ్మ జాడను
కనిపెట్టినవాడు
లంకా దహనమును
కావించినవాడు

శ్రీరామ భక్తుడు
సాటిలేని సేవకుడు
సంజీవిని నతెచ్చాడు
సౌమిత్రినికాపాడాడు

చావులేని యట్టి
చిరంజీవియతడు
బాదరబందీలేని
బ్రహ్మచారియతడు

హనుమంతస్వామి
అందరికీ యిష్టుడు
ఆరాధించేవారిని
ఆదరించేవాడతడు

ఒంటరిగున్నవాళ్ళను
వెంటుండి నడిపించేవాడు
భూతపిశాచ బాధలను
తొలగించేవాడతడు

ఆకు పూజలకు
ఆనందించేవాడు
ఆపన్నులను
ఆదుకొనేవాడు

మారుతి నామమున
మసలు వాడతడు
మాయమర్మము లేని
మహనీయుడతడు

బాదర బందీలేని
బ్రహ్మచారతడు
భక్తుల పాలిట కొంగు
బంగారమతడు

పిలిచిన పలుకు
పవనపుత్రుడతడు
ప్రార్ధించువారలను
పరిరక్షించువాడతడు

మారుతీ స్వామికి
మరల మరలా మ్రొక్కెదా
పవన పుత్రునిని
పదేపదే ప్రార్ధించెదా

ఆరోగ్యమునీవ్వమని
అడిగెదనాంజనేయుని
ఐశ్వర్యమివ్వమని
ఆశ్రయించెద హనుమానుని

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!