ప్రియా చెలికి

ప్రియా చెలికి

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కె.రాధికనరేన్

డియర్ లవ్…

నీ ఆనవాళ్లు కనబడక కళ్ళు పత్తి కాయలవుతున్నాయి. నీవు కాలం వారధిలో అటువైపు నేను, ఇటువైపు.. బంధాల ముడిలో చిక్కుకున్నాము. మన స్నేహం అక్షరంతోనే మొదలయిన. మనసు దోచిన నెచ్చెలివి అయ్యావు.
రాని పాఠాలను నేర్పావు. రంగరించిన నీ ప్రేమలో కర్పూరమై కరిగాను. దేవుని ముందు హారతిలా.
మరి కాలానికే కన్ను కుట్టిందో ఏమో! బంధానికి బంధువులమై చూపులకు దూరమైన మనసుకు దగ్గరితనమే మనకు. ఎన్నని రాయను ఏమని రాయను నీతో పెనవేసుకున్న ప్రతి క్షణం  మరపురాని మధురానుభూతులే ఈ లేఖ రాయలేక రాస్తున్నాను. ఇది నిను చేరుతుందో లేదో తెలియదు గానీ. నిన్ను మర్చిపోలేక రాస్తున్నా వేదన లేఖ. మళ్లీ మనం కలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న నీ ప్రియ చకోరపక్షి.

ఇట్లు:
నిను విడువలేక మర్చిపోలేక మంజూషకి చేరాలని కోరుకుంటున్న.
నీ రాధిక..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!