ప్రియమైన నీకు

ప్రియమైన నీకు…

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆకినపల్లి రుత్విక  సురేష్

ప్రియమైన నీకు ప్రేమతో రాయునది. నిన్ను చూసిన క్షణంలో నాలో ఏదో తెలియని భావన. నీతో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నట్టుగా మనసుకి అనిపించింది. అంతలోనే కనిపించకుండా వెళ్ళిపోయావు. మళ్లీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత కనిపించావు. మళ్లీ నిన్ను చూశాక అదే అనుభూతి కలిగింది నాకు. నువ్వు ఎవరో తెలియదు ఎందుకు కనిపించావో తెలియదు. కానీ నా మనసుకి మాత్రం దగ్గర అయ్యావు. మొదటి చూపులోనే ప్రేమ.. ఒక అబ్బాయిలకు మాత్రమేనా, అమ్మాయిలకు ఉండదా! ఆ అనుభూతి అనుకున్న.
ఇంక మూడోసారి నేను ఏ అబ్బాయిని అయితే చూశానో, తను నన్ను చూడడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ క్షణం నా మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత నువ్వు నాతో మాట్లాడడానికి ప్రయత్నించడం, నా గురించి తెలుసుకోవాలని అనుకోవడం, ఇవన్నీ నీపై ఇష్టం పెరుగుతున్నప్పటికీ, నేను బయటపడలేదు. మామూలుగా ఉన్నాను. నువ్వు నాతో సరదాగా మాట్లాడుతున్నావ్ గ్రీటింగ్ కార్డు ఇచ్చావు. అందులో ఏమైనా లవ్ ప్రపోజ్ చేస్తావేమో అనుకున్న. ఇది ప్రేమ, ఫ్రెండ్షిప్నో నాకు అర్థం కాలేదు. నన్ను ప్రేమించే అబ్బాయి తన మనసులోని భావాలన్నీ కవితగా కూర్చిన ప్రేమలేఖని అందుకోవాలని చాలా ఆశపడ్డాను. కానీ నీ మనసులోని మాటను మౌనంతో దాటేస్తున్నావు.
ఇన్నాళ్లుగా నీ పై, నా మనసులో దాచుకున్న  ప్రేమను అంతా నీతో చెప్పుకోవాలని ఆశ పడుతున్నాను. అందుకని నీకోసం పరితపించే నేను ఈ ప్రేమలేఖను రాస్తున్నాను ప్రియతమా. నీ జవాబు కోసం ఎన్ని జన్మలైనా ఎదురుచూసే నీ ప్రియసఖి.

ఇట్లు,
నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ ప్రేయసి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!