దేవుడు ఇచ్చిన లోపం (సంక్రాంతి కథల పోటీ)

దేవుడు ఇచ్చిన లోపం

(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ -2022)

రచన: సోను

దేవుడు ఇచ్చిన లోపం అదిగమించి ఒక్కటయినా జంట (ఆకాష్ & అమ్ము)

చీకటి గదిలో ఒక చివర కూర్చుని ఏడుస్తూ..  తన చుట్టు ఎం జరుగుతుందో తెలియక తన జీవితం ఎటు వైపు  వెళ్తుందొ తెలియక  అసలు ఇలాంటి జీవీతం ఇచ్చిన దేవుడు ని ఎమ్ అనలేక వెక్కివెక్కి ఏడుస్తూ అలాగే పడుకుండి పోయింది.

తను పడుకున్నాక ఆ గదిలో కి   వచ్చి తనని చూస్తూ .. తన ముఖంలో ఏ భావం చుపించకుండా తనని చూసి తలుపు దగ్గరికి వేసి వెళ్లిపోయాడు.

సూర్య కిరణాలు ముఖం మీద పడుతూ డిస్ట్రబ్ చేస్తుంటే లేచి టైం చూసి ఇంత సేపు పడుకున్నాన  అనుకొని  తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి దేవుడు గదికి వెళ్లి శుభ్రం చేసి పూజ చేసుకొని మనస్సులో దేవుడా నా జీవితం ఎటు వెళ్తుందో తెలియట్లేదు.. నువ్వే నాకు సరైనా మార్గం చూపించు….అని తొందరగా వంట గదిలో కి వెళ్లి టిఫిన్ రెడీ చేస్తూ టైం అవుతుంది అని హడావుడిగా చేస్తూ కాఫీ ఇవ్వాలి . తనకి అని ప్రిపేర్ చేసి గదిలో కి వెళ్లి చూస్తే బెడ్ ఖాళీగా ఉంది.

తన అలోచన కి తానే నిర్లిప్తిమగా ఒక నువ్వు నవ్వుకొని గదిలో నుంచి బయటకి వచ్చి  హాల్ లో సోఫా లో కూర్చొని తన జీవితం ఎందుకు అలా అయింది.

చేతిలో ని హాస్పిటల్ రిపోర్ట్స్ చూస్తూ ….ఇది నా తప్పా వంశాభివృద్ధి కోసం చేసుకున్నారా … నన్ను నా కోసం కాదా హాస్పిటల్ రిపోర్ట్స్ చూస్తూ దీర్గంగా ఆలోచిస్తూ.. లోపం తనలో ఉంటే నేను ఇలా ఆలోచిస్తానా… నా భర్త తను నాతో ఉంటే చాలు అనుకుంటా…తను నాలా ఎందుకు ఆలోచించట్లేదు???

అమ్మ వాలు చేసిన తప్పు నేను అనుభవిస్తున్నా.. వాళ్లకి తెలుసు కదా ఇది ప్రాబ్లెమ్ అవుతుంది అని…పెళ్ళికి ముందె అన్నీ  చెప్పా ము అన్నారు.

అమ్ములు అబ్బాయి చక్కగా ఉన్నాడు మంచి ఉద్యోగం.. అమ్మ నాన్న ఇద్దరు అన్నదమ్ములు, ఆడపడుచు. ఒకసారి అబ్బాయిని చూడు ని అభిప్రాయం చెప్పు మిగితావి  మేము  మాట్లాడు కుంటాం.. అమ్మ అబ్బాయి కి నేను నచ్చాలి కదా.. నా ప్రాబ్లెమ్ విన్న తర్వాత ఈ దరిదాపులో కూడా ఉండడు. అమ్ము అమ్మ కొంచం గట్టిగా అరిచింది.. ఇంకా నేను సైలెంట్ గా ఉన్నాను.

అబ్బాయి ఒప్పుకోవడం ఎంగేజ్మెంత్ , పెళ్ళి అన్ని వెంట వెంటనే అయిపోయాయి.. అమ్మ అన్ని మేము మాట్లాడం నువ్వు కంగారు పడకుండా హ్యాపీ గా ఉండు అన్నారు.

తన పేరు ఆకాష్ . చాలా మంచి వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. ఇద్దరు వేరు కాదు ఒకరం అనే లాగా అయిపోయాం… దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అకాష్ తనే నా ప్రపంచం, నా ప్రాణం…

రోజులు , నెలలు తొందరగా వెళ్లిపోయాయి. ఎపుడు సంవత్సరం అయినదో అర్థం కాలేదు. 1స్త్ వెడ్డింగ్ అన్నివెర్సరీ అమ్మ, నాన్న, అత్తగారు, మావయ్య గారు, మరిది, ఆడపడుచు అందరు వచ్చారు.. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము.. అంతలో అత్తయ్య మాకు శుభవార్త ఎప్పుడూ చెప్తావు.. అని అడిగారు. శుభవార్త  ఎంటి అత్తయ్య అన్నాను. అదేంటి  అమ్ము అలా అంటావ్ . మాకు మనవడుని ఎప్పుడు ఇస్తావ్ ..1 ఇయర్ అయినది కదా మాకు మనవడుని ఇస్తే మేము వాడి ని చూసుకుంటూ కాలం గడిపేస్తాము. మీ  తిప్పలు   మీరు పడండి.

అత్తయ్య అలా అన్న వెంటనే అమ్మని చూసాను సైలెంట్ గా ఉంది. అకాష్ ని చూస్తే తను హ్యాపీ గా ఉన్నాడు. ఎమైనా మాట్లాడతాడు అనుకుంటే తొందర్లో ఇస్తాములే అమ్మ అని అన్నారు… ఒక్కసారిగా  తను ఎం అన్నారో అర్థం కాలేదు. తనకి తెలుసు కదా అత్తయ్య కి చెప్పలేదా?? అమ్మని చూస్తే టెన్షన్ గా ఉంది ..అమ్మ చెప్పలేదా????  ఏమి అర్థం కావటం లేదు. అమ్మ తో మాట్లాడదాము అని అమ్మని తీసుకొని మా రూం కి వెళ్ళాను…

అమ్మ అకాష్ ఎందుకు అలా ఆన్నాడు..తనకి తెలుసు కదా నా ప్రాబ్లెమ్ పెళ్లి కి ముందు మీరు అంత చెప్పారు కదా . అత్తయ్య అలా అదుగుతుంటే తొందర్లో చెప్తామూ  అంటు ఆలోచిస్తుంది..అమ్ము నువ్వు కంగారు పడకు అందరి ముందు ఎందుకు చెప్పడం అని అలా చెప్పిఉంటాడు… కాని నా మనసు మాత్రం అకాష్ కి నిజంగా  తెలుసా తెలిసే అందరి ముందు ఎందుకులే అని అని చెప్పారాయన…అలా పరి విధాలు గా ఆలోచిస్తుంది…ఆకాష్ తో మాట్లాడాలి ఒకసారి అని అప్పటికి అ సంగతి వదిలేసి తనతో సంతోషం గా ఉన్నాను.

అన్నివెర్సరీ తరువాత ఆకాష్ చాలా బిజీ అయిపోయారు.. ప్రాజెక్ట్ వర్క్ సబ్మిస్షన్ అని నేను నేను ఇంకా ఈ విషయం వదిలేసాను.  తన ప్రాజెక్ట్ అయిపోయంది… ప్రాజెక్ట్  సక్సెస్ అయింది అని చిన్న పార్టీ ఆఫీస్ తరపు నుంచి వీళ్ళ టీం వరకు సో పార్టీ కి వెళ్ళాం…. అక్కడ ఆకాష్ ఫ్రెండ్  రోహన్   తన వైఫ్ తో వచ్చారు…. తను ప్రెగ్నన్ట్  అందరు కంగ్రాట్యులేషన్స్ చెప్పాము…. రోషన్ అన్నయ్య ఆకాష్ తో నువ్వు ఎప్పుడు చెప్తావు మాకు మి గుడ్ న్యూస్ అని అడిగారు …..తొందరలో అని చెప్ప్పారు అకాష్…. మళ్ళీ అకాష్ కి నిజం గా నా విషయం తెలుసా అనే డౌట్???? ఇలా ఒకరొజు నేను తనతో మాట్లాడలి అనుకున్న..

నెక్స్ట్ డే శనివారం ఆకాష్ వీకెండ్స్ హాలిడే సో ఆ రోజు ఆకాష్ ని అడిగాను… అమ్మ మీతో ఏమీ చెప్పాలేదా పెళ్లి ముందు నా గురించి అని తను ఏ విషయం లో అని అడిగారు…  నార్మల్ గా అమ్మ ఏమైనా చెప్పిందా నా గురించి పెళ్లి ముందు మనం మాట్లాడుకుంది ..లేదు కదా ..అలా అడిగాను.. ఆ చెప్పారు ఒకరోజు పెళ్లి పనుల గురంచి ఏదో మాట్లాడలి రామ్మన్నారు…. వెళ్ళాను.

అ రోజు  అత్తయ్య ఏదో మాట్లాడుతున్నారు..బట్ అప్పటి కి నేను కాల్ లో ఉన్నా ను …నేను మాట్లాడి వెనక్కి తిరిగేసరికి అత్తయ్య నీకు ఇష్టం..కదా నీ నిర్ణయం చెపితే పెళ్లి పనులు స్టార్ట్ చేద్దాం.. అన్నారు  నేను పెళ్లి గురించి  అయి వుంటుంది అని నాకు ఇష్టమే అత్తయ్య అన్నాను… ఏమైనది అమ్ము ఎందుకు అలా అడుగుతున్నావ్ ..ఏమైన ప్రోబ్లెం ఆ ???? అన్నారు…

నాకు ఎం చెప్పాలో తెలియలేదు…. నా ప్రపంచం ఒక్కసారి గా అగిపోయింది..దేవుడు నాకిచ్చినా గొప్ప వరం ఆకాష్ అనుకున్న నన్ను అర్థం చేసుకొని ..పెళ్లి కి ఒప్పుకున్నారు.. అనుకున్న కాని దేవుడు ఇక్కడ కూడా నన్ను వదల్లేదు… ఆకాష్ కి ఇప్పుడు నా ప్రోబ్లెం గురించి చెపితే అర్థం చేసుకుంటాడా???నన్ను మోసం చేశారు అంటాడా???దేవుడా ఎందుకు నా మీద అంత పగ ఎం పాపం చేసాను..నాతో ఇలా ఆడుకుంటున్నావ్…..ఎం చెయ్యాలి??? ఎవరికి చెప్పాలి???ఈ ఆలోచనలతో సతమతమవుతూ ఆకాష్ తో మాట్లాడటం లేదు…

నా ఆలోచనాలో నేనూంటూ తనకి చెపితే అర్థంచేసుకుంటాడా???మేము ఇద్దరం ఇలాగె ఉండగలమా???ముందులా పిచ్చి ఎక్కుతుంది…

అమ్మ కి చేపితే ??? వద్దు నాకు నేను గా సాల్వే చేసుకోవాలి…. అకాష్ కి చెప్పడం బెటర్ ఏదయినా కాని తనకి తెలియాలి…నా ప్రాబ్లెమ్ చెప్తాను.. నా రిపోర్ట్స్ ఉన్నాయ్ కదా ..తన ఇష్టం ఇంకా నాతో ఉండటం?? ఉండకపోవడం?? అలా ఒక నిర్ణయానికి వచ్చాను…

అమ్ము ఏమైనా ప్రోబ్లెం అ 1 వీక్ నుంచి చూస్తున్న ఒంటరిగా ఉంటున్నావ్…నీలో నువ్వే బాధపడ్తున్నావ్…సరిగ్గా తినట్లేదు? పడుకోవడం లేదు??? ఏదయిన ప్రోబ్లెం ఉంటే చెప్పు ఇద్దరం మాట్లాడుకోని సాల్వే చేసుకుందాం…నువ్వు ఇలా ఉంటే నాకు ఎం బాలేదు…..అది ఎం లేదు ఆకాష్ ఈ రోజు ఫ్రీ నా మీరు కొంచం మాట్లాడలి…సాయంత్రం తొందరగా వస్తారా… మాట్లాడతాను మీతో ,ఏమైనది అమ్ము ఏదయినా ప్రోబ్లెం చెప్పు ఇపుడే అన్నారు.. లేదు సాయంత్రం మాట్లాడకుందాం  అన్నాను….సరే జాగ్రత బాయ్ అని చెప్పి హాగ్ చేసుకొని నుదిటి మీద ప్రేమగా కిస్ చేసి  ఈ ముద్దు లో నీకు నేను ఉన్న అనే భరోసా ఇచ్చారు.

తనని అలా చూస్తూ ఇదే చివరి సారి అనుకుంటా నువ్వు నాతో ఇలా ఉండటం…అ ఆలోచనకే గుండే బరువు అయింది…వద్దన్న కళ్ళలో నుంచి కన్నీరు ఉబికి వస్తుంది.

ఎందుకు అమ్ము అలా ఉంది..ఏమయ్యుంటుంది??అత్తయ్య  కాల్ చేసి అడిగితే ??? వద్దు సాయంత్రం అమ్ము తో మాట్లాడి క్లియర్ చేసుకుందాం..ప్రోబ్లెం ఎదైనా..

సాయంత్రం వర్క్ తొందరగా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళాను ..నన్నుచూసి  అమ్ము వచ్చారా ఫ్రెష్ అయి రండి డిన్నర్ చేసి మాట్లాడుకుందాం ….. ఫ్రెష్ అయి డిన్నర్ చేసేటప్పుడు కూడా సైలెంట్ గా నే ఉంది… అలాగే ఈ సైలెంట్ లో ఎవరి ఆలోచనలలో వారు  డిన్నర్ ముగించారు…. హాల్ లో కూర్చున్నారు ఆకాష్ టీవీ చూస్తూ నాకోసం వైట్ చేస్తూ… రూం లో కి వెళ్లి కప్ బోర్డ్ లో ఫైల్ చూసి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆకాష్ దగ్గరకి వెళ్ళాను….

నా చేతిలో ఫైల్ చూసి ఏంటి అంటూ??? చూసారు.. ఫైల్ తన చేతిలో పెట్టి సైలెంట్ గా తనకి కొంచం దూరం లో కూర్చున్నా… నన్నుచూసి ఒకసారి ఫైల్ తీసి చూసారు… హాస్పిటల్ రిపోర్ట్స్ ప్రశ్నార్థకంగా చూసారు…రిపోర్ట్స్ తీసీ చూసి చేతిలొ ఫైల్ వదిలేసారు…..తన వంక చూసే దైర్యం లేదు……

నా వైపు చూసి ఏంటి ఇవి?????? ఎప్పుడు వినలేదు ఆకాష్ అంత కోపం గా మాట్లాడటం.. ధైర్యంచేసి చెప్పాను.. నా హెల్త్ రిపోర్ట్స్ “నేను ఎప్పటికి తల్లి కాలేను”  ఒకసారి డాక్టర్ ని కలుద్దాం. ప్రోబ్లెం సాల్వ్ చేసుకొని మెడిసిన్ యూజ్చేద్దాం….దానికి ఇంత టెన్షన్ ఎందుకు ????అన్నారు…

తనకి అర్థం కాలేదు అని నాకు అర్థం అయింది… నా ప్రోబ్లెం “AMENORRHEA” అంటే నాకు బాహ్య ప్రపంచంకి తెలిసే లాగా అమ్మాయి లా మార్పులు జరిగిన నాలో  ఆడతత్వం కి అమ్మ అయ్యే అదృష్టం లేదు..ఇప్పటి వరకు నేను ఒక అమ్మాయి కి జరిగే ప్రొసెస్ ప్రతి నెల “మేన్స్ట్రుల్ సైకిల్” జరగలేదు. నా ప్రోబ్లెం కి సొల్యూషన్ లేదు… ఎందుకు అంటే నా లోపం వల్ల గర్భసంచి నుంచి అండం విడుదల జరగదు. ఇప్పటి వరకు నాలో ప్రతి అమ్మాయి ఒక ఏజ్ లో  జరిగేయ్ “రాజ స్వాలా” జరగలేదు… నాలో అమ్మాయి కి ఉండే మార్పులు మాత్రమే జరిగాయి. అమ్మ అవడానికి జరిగే ప్రక్రియ అదృష్టం నాకు లేదు.

పెళ్లికి ముందే అమ్మ మీతో మాట్లాడాను మీకు ఇష్టం.. అని చెప్పారు… అందుకే పెళ్లి కి ఒప్పుకొనున్నా…. మీరు వినలేదు అని మొన్న తెలిసింది. మీ నిర్ణయం ఏదయినా మనస్పూర్తిగా ఒప్పుకుంటాను…అని చెప్పి తనని చూసాను ఎం మాట్లాడలేదు తన మెదడు & మనస్సులో ఎం ఆలోచిస్తునారు .కూడా అర్థం కాలేదు….. నన్ను చూసి సైలెంట్ గా రూం కి వెళ్లి తలుపు వేసుకున్నా రు…….

ఎం మాట్లాడలేదు.కోప్పడలేదు??తనకి కొంచం టైం కావాలి కదా ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు..అని సైలెంట్ గా నేను వేరే రూం లో కి వెళ్ళాను…. ఆ రోజు నుంచి ఆకాష్ నాతో మాట్లాడటం లేదు …..నేను వండినవి తినట్లేదు మనిషి అసలు కనిపించట్లేదు…ఎపుడు వస్తున్నారో తెలీదు…తనకి టైం ఇవ్వాలి అని నేను సైలెంట్ గా ఉన్నా….

సంతోషంగా ఉన్నపుడు టైం తెలియలేదు….ఆకాష్ తో 1 ఇయర్ ఎలా గడిచిందో గుర్తు లేదు…ఇప్పుడు కాలం కూడా ముందుకు కదలట్లేదు….ఈరోజు మాట్లాడతారు ..ఈరోజు అనుకుంటూ 3 నెలలు వెళ్లిపోయాయి..ఒకరోజు నేను ధైర్యం చేసి మాట్లాడాను తను అసలు అక్కడ మనిషి ఉంది అని కూడా లేదు.. తన పని తను చూసుకొని వెళ్లిపోయారు.

ఎం చేయాలో తెలియట్లేదు…ఎవరికి చెప్పాలి నా ప్రోబ్లెం అమ్మ కి చెప్పలేను..నాలో నేను నలిగిపోతున్న ఒకసారి ఆకాష్ కోపం అయిన నా మీద చూపిస్తే బావుండు అనుకున్నా… రాత్రిళ్లు ఏడవడం ఒంటరిగా గడపడం అలవాటు అయిపోయంది… ఒంటరి తనం నాకు తోడుగా ఉంది..

డోర్ బెల్ సౌండ్ కి లేచి ఎవరో అనుకుంటూ చూసాను..డెలివరీ బోయ్  తను ఇచ్చింది తీసుకొని డోర్ క్లోజ్ చేసి వచ్చి హాల్ లో సోఫా లో కూర్చున్న ఇలా ఎన్ని రోజులు????సాయంత్రం మాట్లాడాలి ఆకాష్ తో అనుకొని ఒకప్పుడు సంతోషాలతో  ఉండే ఈ ఇల్లు ఇప్పుడు నిశబ్దం తో ఉంది.

ఆకాష్ కోసం వైట్ చేస్తూ ఉన్న వచ్చారు… ఆకాష్ మీతో మాట్లాడాలి అన్నాను…నాకు ఇష్టం లేదు నీతో మాట్లాడటం అన్నారు.. ఇలా ఎన్ని  రోజులు ఆకాష్ మీ నిర్ణయం ఏదయినా ఒప్పుకుంటా అన్నాను కదా…. ఏదో ఒకటి మాట్లాడు ఆకాష్ పిచ్చి గా ఉంది..ఆరు నెలలు అయింది నీతో మాట్లాడి.. నీకు కూడా టైం కావాలి అని వదిలేసాను..ఇలా ఎన్ని రోజులు ఆకాష్..ఎం మాట్లాడాలి???అంత మోసం చేసి పెళ్లి చేశారు...1 ఇయర్ నాతో ఉన్నావ్ అప్పుడయినా  చెప్పవా???లేదు??ఇప్పుడు అందరు పిల్లల గురించి అడుగుతున్నారు అని చెప్పావ్..నీతో మాట్లాడాలని ,నీ ముఖం కూడా చూడాలని లేదు…వెళ్లిపో… నాకు కనిపించనంత దూరం పో…

ఎం మాట్లాడను??? తన బాధ లోను న్యాయం ఉంది…. నేను ఇంకా తనకి భారం అవ్వకూడదు…వెళ్లిపోతాను  ఆకాష్ నీకు కనిపించినాత దూరం వెళ్ళిపోతాను….

ఆకాష్ ఉదయం లేచి ఆఫీస్ కి రెడీ అయి వెళ్లిపోయాడు..రాకేష్ ఆకాష్ ఫ్రెండ్ లంచ్ బ్రేక్ లో కాంటీన్ కి వెల్దాం రా అని తీసుకువెళ్ళాడు…ఆర్డర్ ఇచ్చి వాళ్ళ ప్లేస్ లో కూర్చున్నాక ,ఆకాష్   కొన్ని రోజుల నుంచి చూస్తున్న ఏదయిన ప్రాబ్లెమ్ ఆ చాలా డల్ &మూడీ గా ఉంటున్నావ్…ఏదయినా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పు నీ మనసులో కూడా భాద తగ్గుతుంది.  రాకేష్ అడిగాక కూడా చాలా సేపు మౌనం గా ఉన్నాడు. లంచ్ రావడంతో సైలెంట్ గా తిన్నాము.. వీడు ఏమి చెప్పడు అని సైలెంట్ గా ఉన్నాడు..

ఆకాష్ చాలా సేపు ఆలోచించి రాకేష్ తో చెప్పాలని కాఫెటీరియా కి తీసుకు వెళ్ళాడు..ఎవరు దగ్గర లేకుండ చూసుకొని దూరం గా కూర్చున్నారు…ఆకాష్ తన ప్రాబ్లెమ్ చెప్పాడు …అమ్ము గురించి తెలిసిన దగ్గర నుంచి అమ్ము తో ఎలా బిహేవ్ చేసింది మాట్లాడింది మొత్తం చెప్పాడు…..

రాకేష్ ఆకాష్ చెప్పింది అంత విని నువ్వు ఎమ్ చేయాలనుకుంటున్నావ్??? అని అడిగాడు…అర్థం కావట్లేదు రా ..”అమ్ము అంటే ప్రేమ తను నా ప్రాణం”   నన్ను మోసం చేశారు అని కోపం ముందే నాకు చెప్పలేదని బాధ…

అంత విని రాకేష్ నేను ఒకటి అడగనా ఆకాష్. ఈ ప్రాబ్లెమ్ నీలో ఉంటే ఎమ్ చేసే వాడివి..అమ్ము నీతో అలా ఉండేదా నువ్వు ఉన్నట్టు.నువ్వే ఆలోచించుకో సొల్యూషన్ దొరుకుతుంది…అమ్ము చాలా మంచిది .నిన్ను సంతోషం గా ఉంచుతుంది…ఇంకోటి  పిల్లలు ఉన్న అందరూ సంతోషం గా ఉంటున్నారా….వాళ్లు మన లైఫ్ లో పార్ట్ ..పిల్లలు పుట్టాక కూడ ఎంత మంది విడిపోవట్లేదు…పిల్లలు మధ్యలో నలిగిపోతున్నారు..

ఒక బంధం కడ వరకు తోడు ఉండాలి  అంటే ఉండాలిసింది. “ప్రేమ “,”నమ్మకం” . అది మీఇద్దరి మధ్య ఉంది…

నేను ఏదో తండ్రిని అవుతున్న నీకు ఎమ్ తెలుసు??? సలహా ఇస్తున్నా అనుకోకు…మీ ఇద్దరి గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా..నువ్వే ఆలోచించుకో ఆలస్యం అవక ముందే నిర్ణయం తీసుకో జాగ్రత….

నాలో లోపం ఉంటే అమ్ము నాతో అలా ఉంటుందా?? ఉండదు నేను తనతో ఉంటేయ్ చాలు అనుకుంటుంది..నేను ఎందుకు ఇలా చేసాను?? అర్జెంట్ గా అమ్ము ని చూడాలి.తనతో మాట్లాడాలి…వెంటనే ఇంటికి బయలుదేరాడు ఆకాష్…లోపలికి వెళ్లి అమ్ము అని పిలిచిన తన జాడ లేదు..ఎక్కడికి వెళ్లింది అని వెతుకుతూ తన రూం కి వెళ్ళాను…అక్కడ టేబుల్ దగ్గర లేటర్ …ఒక సెకండ్ గుండే కొట్టుకోవటం అగిపోయింది..చేతులు వణుకుతున్నాయ్ నా గుండే చప్పుడు నాకు తెలుస్తుంది..లేటర్ చేతిలో తీసుకొని ఒకసారి గట్టిగా శ్వాస తీసుకొని చదవటం మొదలుపెట్టాను..

ప్రియమైన ఆకాష్,
నీ కంటికి కనిపించనత దూరం వెళ్ళిపోతున్న.. కాని నువ్వంటే ప్రాణం… నువ్వు లేకుండా నేను బ్రతకలేను….అలవాటు చేసుకుంటా..నీతో గడిపిన క్షణాలు నా జీవితం లో మర్చిపోలేను..నీ బాధ అర్థం అయింది…అందుకే నీ నుంచి దూరం గా వెళ్లిపోతున్నా.

ప్రేమతో
అమ్ము

చేతిలో నుంచి లేటర్ జారిపోయింది..నా చేతులార నేను చేసుకున్నా వెళ్లిపోయింది…నన్ను వదిలేసి ఎక్కడకి వెళ్ళావ్ అమ్ము ఎక్కడకి వెళ్ళావ్..ఎవరిని అడగాలి . నీ గురించి.. అత్తయ్య నీ అడిగితే ?? అవును అత్తయ్య కి తెలుసుతుంది. నా అమ్ము నీ తెచ్చేసుకుంటా .. వెంటనే అత్తయ్య వాళ్ళ ఇంటికి బయల్దేరాను…ఒకటే ఆలోచనలు అర్థం కాని ప్రశ్నలు??? ఈ ఆలోచనలో అత్తయ్య వాళ్ళ ఇంటికే వచ్చేసాను.. కార్ పార్క్ చేసి వెళ్లి డోర్ బెల్ కొట్టాను…అత్తయ్య ఓపెన్ చేశారు. అత్తయ్య అమ్ము ఎక్కడ ??? మీకు తెలుసా ఎక్కడకి వెళ్లిందో??? చెప్పండి అత్తయ్య. నా అమ్ము నాకు కావాలి..

అత్తయ్య కి ఎమ్ అర్థం కాలేదు.. ఏమైనది ఆకాష్ అని అడిగారు..ముందు లోపలికి రా మాట్లాడుకుందాం..మావయ్యా గారు హాల్ లో సోఫా లో కూర్చుని ఉన్నారు..నన్ను చూసి దగ్గరకి వచ్చి ఎలా ఉన్నావ్ ఆకాష్ అమ్ము రాలేదా??అని అడుగుతున్నారు. నా మొదడు కి అవి ఎమి వినిపించట్లేదు …అమ్ము ఎక్కడ???? నన్ను సోఫా లో కూర్చోమని  గ్లాస్ వాటర్ తెచ్చారు  అత్తయ్య… ఇప్పుడు చెప్పు ఏమైనది అన్నారు???? నేను అమ్ము విషయం అంత చెప్పాను … మా మధ్యలో జరిగిన గొడవ తనతో  ఇలా బిహేవ్ చేసింది…. అత్తయ్య మావయ్య. నీ క్షమించమని అడిగి అమ్ము ఎక్కడ ఉందొ చెప్ప మన్నాను…

అత్తయ్య కాసేపు ఎమ్ మాట్లాడలేదు… తర్వాత నేను నీకు ముందే చెప్పాను కదా ఆకాష్ అ రోజు  నాకు ఇష్టం అన్నావ్ … అప్పుడు కదా పెళ్లి పనులు స్టార్ట్ చేసింది… నేను అ రోజు వేరే కాల్ మాట్లాడుతున్న అత్తయ్య చెవిలో బ్ల్యూఎటూత్ ఉంది. మీరు చెప్పింది వినలేదు.. అత్తయ్య కాసేపు సైలెంట్ గా ఉండి. ఇప్పుడు ఎందుకు వచ్చావ్ ??? ఆకాష్  వెళ్ళిపో వద్దు అన్నావ్ కదా?? వెళ్లిపోయింది. అలా అనవద్దు అత్తయ్య తను లేకపోతే నేను ఉండలేను.. తను ఎక్కడ ఉందొ చెప్పండి నేను వెళ్లి బతిమాలి మాట్లాడుకొని తెచ్చుకుంటా.. ప్లీజ్ అత్తయ్య…చాలా సేపు మౌనం తర్వాత. బెంగుళూరు లో తన బెస్ట్ ఫ్రెండ్.సారిక ఉంది.. అక్కడకి వెళ్లి ఉంటుంది.

సారిక అడ్రెస్స్ తెలుసా అత్తయ్య నేను వెళ్తాను బెంగుళూరు…అని అడిగాను  తన అడ్రెస్స్ ఇచ్చారు.. వెంటనే బెంగుళూరు బయల్దేరాను.. నువ్వు లేకపోతే నేను లేను..వస్తున్న నిన్ను నాతో తీసుకువెళ్లడానికి… అంటూ నా ప్రయాణం  బెంగుళూరు కి…..

ఆకాష్ వెళ్లిపోయాక. అమ్ము వల్ల అమ్మగారు…నాతో ఒకమాట కూడా చెప్పలేదు.. అంత బాధ నీలోనే దాచుకున్నావు… నన్ను క్షమించు రా , నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేక పోయాను… కాని ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు…ఆకాష్ నిన్ను సంతోషం గా చూసుకుంటాడు..తన ప్రాణం రా నువ్వు…

తెల్లవారు జామున. రీచ్ అయ్యాను… సారిక  అడ్రెస్స్ కి 8 గంటలకు వెళ్ళాను…డోర్ బెల్ కొడుతుంటే నా గుండె చప్పుడు నాకు తెలుస్తుంది.. ఇంతలో డోర్ తీశారు.. సారిక అనుకుంటా మీరు అని అడిగింది??? ఆకాష్ అమ్ము హస్బెండ్.. అమ్ము ఉందా లోపల అని అడిగాను…నిద్రపోతుంది అని చెప్పింది.. నేను లోపలికి రావచ్చా.. .అని అడిగాను.. య ప్లీజ్ కం అంది.. తన రూం చూపించింది….

డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను.. .బుజ్జి కుక్కపిల్లల ముడుచుకొని పడుకుంది… ఏడుస్తూ పడుకుంది అనుకుంటా కన్నీటి చారాలు అలాగే ఉన్నాయ్..ఒక క్షణం గుండెలో ఏదో లాగి నట్టు ఫీలింగ్.. తన పక్కన వెళ్లి పడుకొని వెనక నుంచి హాగ్ చేసుకొని నేను పడుకున్నా… నేను హాగ్ చేసుకున్నా వెంటనే ముందుకు తిరిగి  ఇంక దగ్గర జరిగి పడుకుంది.. అ క్షణం చాలా ప్రశాంతంగా అనిపించింది అలా నిద్రలో కి జరిపోయాను….

నిద్రలో కదిలినట్టు అనిపిస్తే మెల్లగా కళ్ళు తెరిచాను…అమ్ము నన్ను అలా చూస్తూ ఉంది… నిజమా కాదా అన్నట్టు..నన్ను టచ్ చేసి నిజమె అని వెంటనే గట్టిగా హాగ్ చేసుకుంది..ఇది కదా నా అమ్ము నా ప్రశాంతత,నా హోమ్….

అలాగేయ్ ఉంది కాసేపటి వరకు తర్వాత వెంటనే నన్ను దూరం గా నెట్టి లేచి కూర్చుంది…చూడడానికి బక్క గా నే ఉంది ..ఇంత బలం ఉందా దీనికి..ఏమైనది అమ్ము అన్న దగ్గరకి జరిగి  ఎందుకు వచ్చారు ??? ఇంకా ఏమైనా బాలన్స్ ఉందా నన్ను తిట్టడానికి తను చెప్పింది..ఎమ్ వినిపించుకోకుండా  తనని మాట్లాడానివ్వకుండా  ఇద్దరి పెదవులు జత చేసాను…తనని ఎంత మిస్ అయింది .అ ముద్దులో చూపించాను…మొదట షాక్ అయింది..తర్వాత తను కూడ మొదలుపెట్టింది ముద్దు ఇవ్వడం తన కన్నీళ్లు చెప్తున్నాయ్…తను నన్ను ఎంత మిస్ అయిందో…. శ్వాస తీసుకోవటం కష్టం గా ఉంటే వదిలాను… ఎమ్ మాట్లాడ లేదు తను….

నేను తన ముఖం నీ నా రెండు చేతిలో తీసుకొని …తన కళ్ళలో చూస్తూ  నువ్వు లేకపోతే నా ప్రాణం పోయినట్టు ఉంది… నాకు పిల్లలు వద్దు..నువ్వు ఉంటే చాలు… నువ్వే నా పాప వి ,నీకు నేను నాకు నువ్వు……నన్ను ఇంక ఎప్పుడు అలా వదిలి రాకు….నేను ఉండలేను…

తన కళ్ళలో నుంచి కన్నీళ్ళ ప్రవాహం …అమ్ము  అలా మౌనం గా ఉంది..ఒకరి కళ్ళలో ఒకరం చూసుకుంటూ ఇన్ని నెలలు ఇద్దరం పడిన బాధ … మా ఇద్దరిని ఇంకా దగ్గరి చేసింది...చాలా సేపు మౌనం తర్వాత అమ్ము మాట్లాడినది…

మీకు పిల్లలు అంటే చాలా ఇష్టం ఆకాష్ మీరు వేరే పెళ్లి చేసుకోండి..ఫ్యూచర్ లో పిల్లల టాపిక్ లో మల్లి మీరు నన్ను చూసి తప్పు చేసాను అనుకోకూడదు….

తనని మాట్లాడానివలేదు..నాకు ఎవరు వద్దు..నువ్వు చాలు…కావాలి అంటే పాప నో బాబు నో అడ్పాట్ చేసుకుందాం…నువ్వు మాత్రమే కావాలి… పిల్లలు లేకపోయినా ఉంటాను..నువ్వు లేకపోతే ఉండలేను…ప్లీజ్ అమ్ము మన ఇంటికి వెళ్లిపోదాము..

అమ్ము గట్టిగా హాగ్ చేసుకొని అలానే ఉండిపోయంది.లవ్ యూ ఆకాష్ లవ్ యూ సో ముచ్ …నన్ను వదలకు నేను ఉండలేను… వదలను రా …నువ్వు నా ప్రాణం…అమ్ము

ఇలా మన అమ్ము&ఆకాష్ ఇద్దరు ఒక పాప నీ అదొప్ట్ చేసుకొని హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు…..

భార్య భర్తల మధ్య ప్రేమ,నమ్మకం ఉండాలి.పిల్లలు మన లైఫ్ లో ఒక పార్జ్… వాళ్ళే మన లైఫ్ కాదు…ఇప్పటి కాలంలో ఆధునానిక పద్దతులు…అయివిఫ్, ఐయిఐ, సర్రోగట్ అనే కొత్త పద్దతులు వచ్చాయి….అడ్పాట్ చేసుకొని పిలల్లని పెంచుకోవచ్చు…

భార్య లో లోపం ఉందని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటారు….అదె భర్త లో లోపం ఉంటే భార్య ఎప్పుడు భర్త నీ వదలదు… భర్త తన మొదటి బిడ్డ..అనుకొని తనతో నే ఉంటుంది.

పిలల్లు మధ్యలో వస్తారు …మధ్యలో నే వెళ్లిపోతారు…మూడుముళ్లు వేసిన అప్పటి నుంచి  చనిపోయేవరకు కలిసి ఉండేది..భార్య భర్తలు మాత్రమే…. ఇద్దరి మధ్య ప్రేమ అ బంధాన్ని ఇంక దగ్గర చేస్తుంది.

ఆకాష్ లా అర్థం చేసుకునే భర్త దొరకటం కూడా కష్టమే ….బట్ ఇప్పటి పరిస్థితులు భర్త ,భార్య ఎవరి లో అయినా లోపం ఉంటుంది…దాన్ని అర్థం చేసుకుని ఒకరికి ఒకరు తోడు ఉంటూ అర్థం చేసుకోవడం వల్ల జీవితం నీ ముందుకు తీసుకు వెళ్ళాలి..

కోపం,ఆవేశం, నీ వల్ల ఇలా జరిగింది నువ్వే రెస్పాన్స్బిలిటీ ఇలా ఒకరి మీద  ఒకరు నిందలు వేసుకోకుండా..ప్రశాంతం గా  కూర్చొని మాట్లాడుకొని తరవాత ఎమ్ చేయాలో …నిర్ణయించుకోవాలి.

ఇది మన ఆకాష్ & అమ్ము కధ.

You May Also Like

One thought on “దేవుడు ఇచ్చిన లోపం (సంక్రాంతి కథల పోటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!