ఏడు వారాల సోగ్గాడు

ఏడు వారాల సోగ్గాడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

శోభన్ చిన్నప్పట్నుంచి అందరిలా కాకుండా స్పెషల్ గా ఉండాలని ఆలోచనతోటే ఎదిగాడు. తన ఫ్రెండ్స్ అందరిలో తనే ప్రత్యేకంగా ఉండాలనుకుంటూ ఉండేవాడు. “హైస్కూల్ చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు సరళ, విశ్వనాథ్ ఏదీ సొంతంగా చేయనివ్వలేదు”. కాలేజీకొచ్చాక శోభన్ కి రెక్కలొచ్చాయ్. అన్నీ సొంతంగా సెలెక్ట్ చేసుకోవడం. ప్రతిరోజూ తను ఎలా ఉండాలనుకున్నాడో అలానే ఉండడం కుదిరింది. “స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొంటున్న కొడుకు శోభన్ అందంగా తయారవడమే కాక, ప్రవర్తనలో కూడా మంచి పేరు తెచ్చుకుంటుండడంతో
విశ్వనాథ్, సరళ లు శోభన్ ని  స్వేచ్ఛగా వదిలేశారు”. “శోభన్ ఏ పని చేసినా వహ్వా.. వహ్వా అంటూ ఫ్రెండ్స్ మునగచెట్టెక్కించేసేవారు”. “తోకెత్తిన కాకి, తోక దించిన కాకి అంటూ ఫోటోలు తీస్తూ పండగ చేసుకొనేవారు”. వాళ్ళ పొగడ్తలతో ‘స్పెషల్ గా ఉంటే ఎంత బాగుందో అనుకున్న శోభన్ పిచ్చి పరాకాష్ఠ కి చేరింది’. ‘తను చేసేవన్నీ అప్పటికప్పుడు ప్రత్యేకంగా చేసినవే కావడంతో శాశ్వతంగా తన పేరు నిలబడేలా ఏదో ఒకటి చేయాలని రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు’. శోభన్ స్పెషల్ గా ఉంటున్నాడు. రోజులు గడుస్తున్నాయ్. ఎవరూ శోభన్ ని మెచ్చుకోవడం లేదు. “విసిగెత్తిన శోభన్ ఈరోజు హీరో అయినా అవ్వాలి, లేదంటే జీరో అయినా అవ్వాలి అనుకుంటూ ఫ్రెండ్సందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు.” పార్టీలో “అందరికీ నేనో స్పెషల్ విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే ఒక రోజు వేసిన డ్రస్ మరొక రోజు వేసుకోను, అంతే కాదు కలర్ కూడా ఒకరోజు వేసుకొన్న కలర్ వేసుకోను” అంటూ తన స్పెషాలిటీని చెప్పాడు. “ఎన్ని డ్రస్ లు కొంటావ్ రా..నువ్వేమైనా కోటీశ్వరుడివా “అంటూ ఫ్రెండ్ రాజేష్ అడిగాడు. “ఒరేయ్..ఆల్రెడీ నేను  వారం నుంచి వేసిన డ్రస్ వేయట్లేదు మీరెవరూ గమనించలేదంతే. నాకేమీ ఇబ్బంది అనిపించలేదు”అన్నాడు శోభన్. “ఏడువారాల నగలనుకున్నావా గొప్పగా వారానికో ఆభరణం ధరించడానికి. రంగు రంగుల గుడ్డ ముక్కలు రా” అంటూ రాజేష్ హేళన చేశాడు. “ఇరవై ఎనిమిది రంగులు ఇరవై ఎనిమిది రోజులూ మారుతూ ఉంటాయ్”. “నెలలో మిగిలిన ఆ మూడురోజులూ తెల్లటి డ్రస్ వేసుకుంటా.” ‘తర్వాత నేనెంత ఫేమస్ అవుతానో చూడు”అంటూ శోభన్ తన గొప్ప నిర్ణయానికి డాంబికాన్ని జోడించి రాజేష్ తో ఛాలెంజ్ చేశాడు”. అన్నీ డ్రస్ లు ముందే ఉతికి ఐరన్ చేసుకున్నాడు. “నాలుగు రోజులు గడిచాక సరళ శోభన్ డ్రస్ లలోంచి ఒకటి తీసి తన చెల్లెలు కొడుక్కి ఇచ్చేసింది.” “శోభన్ ఆ విషయం గమనించుకోలేదు.” “ఇరవై రోజులు గడిచేసరికి శోభన్ గురించి మొబైల్ ఫోన్లలో వైరల్ న్యూస్ వ్యాపించింది”. ఎంతో మంది శోభన్ ని చూడడానికి పరుగులు పెట్టారు. “ఇంటర్వ్యూలు ఇమ్మని ఉత్తుత్తి ఛానల్ దగ్గరి నుంచి పెద్ద ఛానెల్ దాకా వచ్చేశాయ్. ప్రెజెంట్ సిచువేషన్ అలాంటిది”. “తుమ్మితే చిత్రం, దగ్గితే విచిత్రం”. ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో తన ఇరవై ఎనిమిది డ్రస్ లను చూపిస్తుండగా ఒక డ్రస్ తక్కువ రావడంతో డ్రస్ ఏమైందో తెలియక నాలుక్కరుచుకున్నాడు. చానెల్ వాళ్ళు ఇక అదేదో బ్రేకింగ్ న్యూస్ అయినట్టు బాదుడే బాదుడు. “ఏడువారాల సోగ్గాడు”అంటూ టీవీల్లో ఫేమస్ అయ్యాడు శోభన్.” సరళ, విశ్వనాథ్ తమ కొడుకు ఫేమస్ అయ్యాడని సంతోషపడ్డారు. పెళ్ళి సంబంధాలు చూశారు. ఎన్ని సంబంధాలొచ్చినా ఎవరూ నచ్చలేదని చెప్పడంతో విశ్వనాథ్ కి డౌటొచ్చి ఏరా! “ఎవర్నైనా ప్రేమించావా?” నిజం చెప్పు వాళ్ళ తోటే మాట్లాడదాం అని గట్టిగా అడగడంతో శోభన్ ప్రేమించాను నాన్నా అంటూ బాంబు పేల్చాడు! “ఎవర్రా ఆ అమ్మాయి అని ఆతృతగా అడిగాడు విశ్వనాథం”? దానికి శోభన్ “మా ఫ్రెండ్ రాజేష్ చెల్లెలు సుజి”అన్నాడు. విశ్వనాథ్ “ఇంతకీ ఆ అమ్మాయికి తెలుసా ?”అన్నాడు. “లేదు నాన్నా వన్ సైడ్ లవ్ అన్నాడు”. విశ్వనాథ్ తలపట్టుకొని “రాజేష్ వాళ్ళింటికెళ్ళి మా వాడు చాలా ఫేమస్. ఏడు వారాల సోగ్గాడు” మీ అమ్మాయిని అడగడానికొచ్చాను అని సూటిగా అడిగాడు! “రాజేష్ కి శోభన్ చేసే తింగరి పనులు నచ్చనందువల్ల రాజేష్ “అంకుల్ నేను మెకానిక్ గా పని చేస్తున్నా. మీ వాడు ఏం చేస్తున్నాడు”అని అడిగాడు.”మా వాడికేం నేను సంపాదిస్తున్నాగా “అన్నాడు విశ్వనాథ్. “అదే అంకుల్ మీ సంపాదనని పిచ్చి పిచ్చి డ్రస్సులకి తగలేసే వాడికి నా చెల్లెల్ని ఇవ్వడం నాకిష్టం లేదు అంటూ రాజేష్ కరాఖండీగా చెప్పడంతో విశ్వనాథ్ రాజేష్ వాళ్ళ నాన్నతో “మా వాడు చదువుకున్నాడు. ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు. “నన్ను నమ్మండి, ఒకసారి అమ్మాయి అబ్బాయి చూసుకొని ఒకరికొకరు నచ్చితే ప్రొసీడ్ అవుదాం” అనడంతో రాజేష్ వాళ్ళ నాన్న సరే నంటూ తల ఊపేశాడు. “రాజేష్ కి శోభన్ సోమరితనం, పిచ్చి పనులు నచ్చట్లేదు. “ఎలాగైనా ఈ పెళ్ళి చెడగొట్టాలని సుజీ దగ్గరికెళ్ళి “ఏవమ్మా సుజీ..నీకు శోభన్ అంటే ఇష్టమేనా “అన్నాడు. సుజి “ఇష్టమంటే, శోభన్ ఎలాంటి వాడో తెలియదన్నయ్యా!”అంది. నేను చెప్తా విను వాడు నెలకోసారి స్నానం చేస్తాడు. విచిత్రమైన డ్రస్ లు వేసుకుంటాడు. సోమరిపోతులా తిని తొంగుంటాడు” వాడు నీకవసరమా అనడంతో సుజి “నువ్వు చెప్పేది నిజమేనా అన్నయ్య, నాకు నమ్మకం కుదరట్లేదు “అంటూ శోభన్ ని కలవడానికి వెళ్తుంది. రాజేష్ ముందే శోభన్ దగ్గరికెళ్ళి “నీ గ్లామర్ కొంచెం తక్కువగా ఉందని ఆలోచిస్తుందిరా నా చెల్లి”అన్నాడు. “అవునా!..ఏం చేయమంటావ్ బావా”అనడంతో రాజేష్ కి బావా అన్న పిలుపు నచ్చలేదు “నిద్రపోవాలిరా, అప్పుడే గ్లామర్ పెరుగుతుంది. నా చెల్లెలు వచ్చినప్పుడల్లా నిద్రపో “అంటూ ఉచిత సలహా ఇచ్చేశాడు. సుజి శోభన్ ని కలవడానికి వెళ్ళింది. శోభన్ నిద్రలేస్తూ వచ్చి ఏం సుజి ఈ గ్లామర్ సరిపోద్దా అనడంతో సుజీ కి కోపం వచ్చింది. అమ్మాయిని కలవడానికి వచ్చినప్పుడు ఇలాంటి డ్రస్ ఏంటి ..ఆ నిద్రేంటి..అంటూ విసురుకొని వెళ్ళిపోయింది. ఈరోజు ఈ కలర్ డ్రస్సే వేసుకోవాలి సుజీ అది నా స్టైల్ అంటుండగా సుజీ వాళ్ళ వీధి చివరికెళ్ళిపోయింది. ‘రాజేష్ వల్లే బ్యాడ్ అయిపోయానని భావించి’. ఈ సారి “హుందాగా ప్రవర్తించాలని సుజీ వాళ్ళ ఇంటికి అమ్మని తీసుకెళ్ళడానికి ప్లాన్ వేశాడు”. రాజేష్ వాళ్ళని రానివ్వకుండా ఏదో ఒక అడ్డు పుల్లలు వేయడంతో వాయిదా పడుతూ వచ్చింది.” వారం తర్వాత ఎలాగోలా అమ్మతో సుజీ వాళ్ళ ఇల్లు చేరాడు. సుజీని చూసిన సరళ “ఏమ్మా ..వంటా వార్పు వచ్చా”అంది. సుజీ కోపంగా లేచి “మంట పెట్టడం వచ్చు”. “నాకు శోభన్ ని చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటారా! వారం ముందు నేను కలిసినప్పుడు వేసుకున్న డ్రస్సే ఈరోజు కూడా యూనిఫాం లాగా వేసుకున్నాడు. సోమరిపోతు, శుభ్రంగా ఉండడు. ఇలాంటి వాడితో నేను కలసి నడవలేను”. “అంటూ కన్నెర్ర చేసి మాట్లాడుతుంటే సరళ ఆశ్చర్యంతో ఈ కాలం కోడళ్ళని భరించడం కష్టమే. పెళ్ళీ వద్దు ఏమీ వద్దు పదరా వెధవా. మా పరువు తీశావ్ అంటూ సరళ ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది. ఏడువారాల డ్రస్సుల వల్లే సుజీ కి తను నచ్చలేదని తెలిసినా శోభన్ తన పంథాను వదులోకోలేక పోయాడు. అందుకే సుజీనే వదిలేసుకున్నాడు. ఇంటింటా ఒకడుంటాడు. ఇంటింటి రామాయణంలో ఇతడే హీరో. “ఈరోజుల్లో వెర్రితనమే ప్రత్యేకం, దాని కోసం పాకులాడుతూ బంధాలను దూరం చేసుకొనే విచిత్ర నాగరికతా దోరణిలో బతుకుతున్నాం”.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!