ఎన్నాళ్ళిలా….?

అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )

ఎన్నాళ్ళిలా….?

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

రామనాధం మాష్టారు వరండాలో కుర్చీలో కూర్చోనీ పేపరు చదువుకుందామని పేపరు తీశారు.పేపరునిండా కరోనా గురించి వార్తలే.చదవడానికి బుద్ది పుట్టక క్రింద పడేశాడు. అలా ఆకాశం వైపు చూశాడు.ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా రెక్కలు విప్పుకొని హాయిగా తిరుగుతున్నాయి.ఎదురుగా కేబుల్ తీగలపై పక్షులు వాలి హాయిగా వున్నాయి.మనుషులే అలా తిరగలేక పోతున్నారు.మహమ్మారి ఎక్కడినుంచో వచ్చి ప్రపంచాన్ని కకావికలు చేసేసింది.అంతటా నిర్మానుష్యంగా వుంది.ప్రభుత్వం లాక్డవున్లు ,షట్డైన్లు  ప్రకటించేసింది.బయటకి వెళ్ళే వెసులుబాటేలేదు.
అందులో తనలాంటి వయసు మళ్ళినవారికి మరిన్ని ఆంక్షలు.ఇదే కరోనా రాకముందు తనెంత తీరికలేకుండా ఉండేవాడో.తమ కాలనీలోవున్న విశ్రాంత ఉద్యోగులందరంకలసి ఒక సమూహంగా ఏర్పడి ఎన్నో కార్యక్రమాలను చేసేవాళ్ళం.ఉదయాన్నే లేచి ఉదయపు నడకకు వెళ్ళి వచ్చెవాళ్ళు.కాస్సేపు అందరం తనింటి దగ్గర కూర్చోని కబుర్లు చెప్పుకొనే వారు.మళ్ళీ సాయంత్రం సాయంత్రపు వ్యాహ్యాళికి వెళ్ళెవారు.చాలా ఉత్సాహంగా గడిచేవి రోజులన్ని.
ఎదురింటి రామరాజు రంగారావు సుభ్రమణ్యం ఈ పక్కా గంగరాజు ఆ పక్క రామారావు అందరు రామనాధం మాష్టారింటిదగ్గరే ఉండేవారు.వాళ్లందర్లోకి రామనాధం మాష్టారే పెద్ద.ఆతని సలహాలపైనే అన్నీ చేసేవారు.ఇప్పుడు పరిస్తితులన్ని తారుమారై పోయాయి. ఇప్పుడు ఎవరూ కలవటంలేదు.కనీసం ఫోనులోకూడా మాట్లాడటం లేదు.ఎదురుపడితే కూడా మాట్లాడుకోవడంలేదు. ఒకరినిచూసి ఒకరు భయపడిపోతున్నారు.ముక్కు మూతి మూసుకొని వున్నా మాట్లాడటానికి కూడ ఇష్టపడటం లేదు.
అలా ఇండ్లలో జైల్లో దొంగల్లా వుండటం భరించశక్యంగాలేదు.ఎవరికి వారే యమునాతీరేలా తయారైపొయింది వారి పరిస్తితి.ఇలా ఎన్నాళ్ళు ఈ జీవితంగడపాలో తెలియటం లేదు.
“టిఫిన్ చేయడానికి లోపలికి వస్తారా”.భార్య శాంత పిలుపుతో “హా!వస్తున్నానంటు”లోపలికి వెళ్ళారు రామనాధం మాష్టారు. టిఫిన్ చేశాక మళ్ళి వరండాలోకి వచ్చి కూర్చున్నారు
రామనాధం మాష్టారు.

ఇంతలో ఫోను రింగైంది.కొడుకు నుండి వచ్చింది.”ఎలా వున్నారు నాన్న?అమ్మ మీరు బాగానే వున్నారు కదా.అక్కడ పరిస్తితులేమి బాగున్నట్టులేవు.మీరు బయటకి వెళ్ళడం లేదు కదా?
మీకేం కావాల్సినా నాకు చెప్పండి ఆన్ల్లైలో పంపిస్తాను.మీరు మాత్రం ఏమి తోచటంలేదని సాహసాలు చేయకండి”
“సరేలేరా!మేము జాగ్రత్తగానే వున్నాము.కోడలు మనవడు ఎలావున్నారు?మీరు కూడా జాగ్రత్త”అంటు జవాబిచ్చారు.రోజు కొడుకు ఫోనుచేసి అన్ని విషయాలు తెలుసుకుంటాడు.అదే కొంత ఉపశమనం.
ఫోనులో వాట్సప్ మెసేజులు చూడడంలో ములిగిపోయారు.సామాజిక మాధ్యంమంలో కొన్ని సాహితీ సమూహాలలో చేరి కవితలు కధలు రాస్తూ మరో కాలక్షేపం ఏర్పరుచుకున్నారు రామనాధం మాష్టారు.ఇదికూడా కరోనా వరమే.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!