అమ్మ – అయ్య

అమ్మ – అయ్య

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

ప్రేమకు వేరుగా లేదు అమ్మ,
బాధ్యత కలిపాడు అయ్య;

బువ్వ కావాలంటే పెట్టింది అమ్మ,
సంఘంలో పేరు నిలిపాడు అయ్య;

నా కోసం పాటలు పాడింది అమ్మ,
ఆటలు ఆడించి నేర్పాడు అయ్య;

అనురాగానికి మారు అమ్మ,
అవ్యక్త వాత్సల్యం అయ్య;

మమకారానికి పేరు అమ్మ,
జీవనపథంలో తేరు అయ్య;

అమృత వాక్కు అమ్మ,
సుధా వారధి అయ్య;

నా పుస్తక భూషణం అమ్మ,
అందు అక్షరమాల అయ్య

అమ్మ కళ్ళలో మాధుర్యం చూసి
అయ్య స్వేదంలో సేద తీరాను

అమ్మాఅయ్యలే కదా నా చైతన్యం,
అంతకు మించి అదృష్టం ఏముంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!