నీవే ఆలంబన వైతే!?
రచన:: బి హెచ్.వి.రమాదేవి
నీవు దిక్కులేని పక్ష్ణి నీ అనుకోకు!
దిక్కులను ఏకంచేసే ఉన్నత స్థాయి నీది!
ఎవరో ఒకరు ఆలంబన కావాలనుకోక!
ఎవరికైనా నీవే ఆలంబన కావాలి!
కష్టాలకో,నష్టాలకోవణకకుకష్టం దాటే మార్గం చూడు!
వెధవ కన్నీళ్లు ఎన్ని కార్చితే,
కార్చిచ్చు ఆరుతుంది!!?
పథకం వేశామంటేనా!?పదిమంది బువ్వ తినాలంతే!
సిగ్గులు పడడం,మెలికలు తిరగడం చేయడానికి,
మనం చీరలు కట్టుకుంటున్న,
భామలమా యేమిటి!? నింగికి
ఎగసిన వ్యోమ గాములం!
అవసరంమైనచోటమాత్రమే
సిగ్గువదిలినా,సిగ్గు పడినా..
అందాకా కాస్త దాచుకోండి!
ఆలోచనలు అభివృద్ధి తెలివి తేటలు రైతు బజారులో దొరికినా రాజసంపోక కనుక్కోండి!
బుద్ధి లేకపోతేబుద్ధిజం చదివినా తెలివిరాదు,,,అందుకే
నేనుచెప్పినట్లు వినండి! దూసుకు పొండి బాణంలా!
మూసుకు పొండి ధైర్యాన్ని,!
వేసుకి పొండి నాలుకతో ప్రణాళికను ప్రహేళికను..
విజయానికే ఆశ్చర్యం పుట్టేలా..
అపజయానికి దడ పుట్టేలా!
అభివృద్ధి ని మెట్టేలా!
అప్పుడునువ్వేవిజయానికి రూపం!
నీ నవ్వే అద్భుత వన్నెల పతాకం!
******