మొగుడే ఒక చాదస్తం

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

మొగుడే ఒక చాదస్తం

రచయిత :: బండారు పుష్పలత

చాదస్తం చాదస్తం చస్తున్నా ఈ చాదస్తం మొగుడితో…
పొద్దునే లేస్తాడు గంట స్నానం చేస్తాడు….
పూజ కోసమై పూలుతెమ్మంటాడు కీటకాలు వాలాయంటూ కడిగి పూజచేస్తానంటాడు…
మడికట్టుకు వంట చేస్తే
అటుముట్టా విటు ముట్టవనుటు మళ్లీ తాను చేసి తంటాలు పడ్డానంటాడు
ఇళ్ళుఊడ్చి తుడిస్తే క్రిములుపోలేదంటూ మళ్లీ తుడవమంటూ నావెంటే వుంటూ చంపుకుతింటాడు..
అద్దం ముందర నిలబడి జడ వేసుకుంటుంటే వెంట్రుకలు ఇల్లంతా జల్లావని కుప్పి గంతులేస్తాడు. తిప్పలపాలు చేస్తాడు..
ఇంట్లో బోరుకొట్టిందని పార్కుకు వెల్దామంటే.. ప్రేమికులుంటారంటూ పిల్లలు చెడిపోతారంటూ నానా పాట్లు పడతాడు హైరానా పెడుతాడు..
ఆఫీస్ నుండి రాగానే
కడిగిన చేతులు కడిగి మార్చిన బట్టలు మార్చి చాదస్తం కాస్త పిచ్చి లాగా చేస్తాడు…
పిల్లలు బయటాడి వస్తే అతి చాదస్తంతో వాళ్ళని బయటకెందుకు పంపావు రోగాలు రోస్టులు వస్తే చేసేదెవరంటూ అల్లరి
అల్లరిచేసీఅలిగికూర్చుంటాడు
ఆలోచన లన్ని చూసి పిల్లడనాలో ముసలి వాడనలో అర్థం కాని స్థితి నా పరిస్థితీ…
వూరెళదామంటాడు పిల్లి అడ్డమొచ్చిన,తూచ్చంటూ తుమ్మినా నానా గాబరపడి పోయి బయపడి భయపెట్టి చంపుకు తింటున్నాడు..
పిల్లతో ఇలా ఉండాలి ఆలా తినాలి ఇలానే పడుకోవాలంటూ
చెప్పిందే చెప్పి వాళ్ళ తిప్పలుపెట్టేస్తాడు..
కూరల్లో నూనె ఇంత పోస్తే గుండెకాయ ఏంకావాలంటాడు గుడ్లురిమి చూస్తాడు…
బంగారం చీరలు కొనండని నేనంటే నీవే బంగారము మసిగుడ్డ మాణిక్యమని మాటను దాటేస్తాడు…
ఎవరికి చెప్పను బాధ ఏమని చెప్పను నా వ్యధ అలాగని శాడిస్ట్ అని చెపుదామంటే
నను కొట్టి బాదించడుగా..
సరే చేసుకున్న కర్మనికి సర్దుకు పోయి సంసారంచేస్తేనే ఆనందం ఆరోగ్యం, సౌబాగ్యం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!