ముంచుకొస్తోంది ముప్పు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కార్తీక్ నేతి
ముంచుకొస్తోంది ముప్పు ,
రగులుతోంది ఇరు దేశాల మద్య నిప్పు,
సంకేతికంత అంటూ అభివృద్ధి చేస్తున్నారు అన్వాయుధాలు,
వేదికల పై శాంతి కోసం ప్రవచనాలు వల్లిస్తూ,
పోగు చేసుకుంటున్నాయి అనుఅయుధాలు,
రాను రాను పెరుగుతున్నాయి వాదాలు,
చాప క్రింద నీరులా పాకుతున్నాయి పగలు
ఇదే అదును అన్నట్టు చిన్న చిన్న దేశాలు ఆయుధాలను తయారుచేసి,
అమ్ముకుంటూ యుద్దాలను
నడిపిస్తున్నారు ముందుకు,
అంతకంతకు దిగుబడి చేసుకుంటున్నారు సైనికులను,
ఇదే పరిణామం నడిస్తే ముంచుకొస్తుంది మూడో ప్రపంచ యుద్ధం, స్మశానం అవుతుంది సమస్తం