(అంశం:: “చాదస్తపు మొగుడు”)
చాదస్తపు చెవిటి మేళం
రచయిత :: తేలుకుంట్ల సునీత
కళ్ల జోడు తెమ్మంటే ..
కాళ్ళ జోడు తెస్తాడు
పండ్ల రసం తెమ్మంటే..
చింతపండు రసం తెస్తాడు
ఉంగరాలు తెమ్మంటే…
బొంగరాలు ఆడతాడు
విగ్గు తెచ్చి ఇవ్వమంటే…
పెగ్గు లేస్తూ ఉంటాడు.
మల్లెపూలు కొనమంటే…
మరమరాలు కొంటాడు.
చుక్కల చీరె తెమ్మని అంటే
చిల్లుల గారెలు తెస్తాడు
ఏం మాట్లాడినా
ఎన్ని తిట్లు తిట్టిన
వినపడక …
నోరు మెదపడనుకున్నా
ఎడ్డెం మంటే తెడ్డేమంటూ
ఎద్దేవా చేస్తాడు
అదరగొట్టి బెదర గొట్టి
గందర గోళం చేస్తాడు
చాదస్తపు మొగుడు వీడు
దానికి చెవుడు తోడు
చావ లేక బ్రతికున్నా
బ్రతికి ఉండి చస్తున్నా….