కర్కశ పాషాణులు

కర్కశ పాషాణులు

రచన: సావిత్రి కోవూరు 

తెల్ల తెల్ల వారంగా తెల్లవారంగా తొలిపొద్దు వెలుగుల్లో

మెల్ల మెల్లగా అమ్మ ఒడి లోన కన్ను తెరిచే ఆ గువ్వపిట్ట

లోకమంతా రవికాంతి పుంజములు నిండగా కని ఆనందంతో,

ఆహ్లాద జనితమైన మానసంబుతో ఎంత అందమైనదీ   లోకమని తలచి

లోలోన ఎంతో మురిసే అమ్మ ఒడిలోన భద్రతతో ఉన్న తను లోకమంతా

భద్రమే అని తలచి మనసులో ఎంతగానో నిశ్చింతగ ఉండ, సంబరంబున నాట్యాలు చేసే

అమ్మ బాహువులే కోటగోడలుగా ఉండగ
నాన్న కరములు తన నడకకు చుక్కాని అని తలచి

ధైర్యంతో శత్రువులే ఉండరని భ్రమలోన పెరిగే రోజులెన్నో హాయిగా  గడుచుచుండ

కొత్తగా రెక్కలు వచ్చే ఆ చిన్నిగువ్వకు
నింగిలోనికెగర

ఉత్సుకతతోడ సంబరముగ రెక్కలల్లార్చుచు బయలుదేరగా

చుట్టూ మేక వన్నె పులులు, నరరూప రాక్షసులు కఠిన దృక్కులతో, కబళింప,

కాపు కాచి ఉన్నారని యెరుగని ఆ అమాయకపు గువ్వా ఆనందమంత తనదిగా

అమ్మ ఒడిని వీడి, వీధిలోకి రాగ కామపిశాచాలు వద్దు వద్దు వద్దన్నా అని మొత్తుకున్నా

రెక్కలు విరిచి నేల రాచి,పాశవికంగా ప్రాణాలు తీసే పాషాణులై.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!