సత్యమేవ జయతే

సత్యమేవ జయతే

రచన: చంద్రకళ. దీకొండ

సత్యం కాళ్ళకు చెప్పులు తొడుక్కునేలోపు…
అసత్యం లోకమంతా చుట్టేస్తుంది…!
సత్యశోధకునికి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం గావించిన గణపతికి దక్కిన గౌరవమే దక్కుతుంది…
ప్రథమ పూజలకు అర్హమౌతుంది…!
నిలదొక్కుకునే ధైర్యాన్ని కడదాకా నిలుపుకుంటే…
నిజం నిలకడ మీద తేలుతుంది…!
అష్టకష్టాలు పడిన సత్య హరిశ్చంద్రుడు…
ఆదర్శ చరితుడై నిలిచాడు…
సత్యాన్వేషణ గావించి అహింసా పోరాటం చేసిన బాపూజీ…
చరిత్రలో మహాత్ముడై వెలిసాడు…!
మాటున దాచి ఉంచినా…
నిప్పులాంటి నిజం ప్రకాశంగా వెలుగులు వెదజల్లక మానదు…
అసత్యాన్ని అంతం చేయక విడువదు…!!!
**********************************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!