నరక కూపం

నరక కూపం

రచన: పిల్లి.హజరత్తయ్య

పుడమి తల్లి పురిటి నొప్పులు
మనిషి సాంకేతికతను తూర్పార బడుతున్నది

మూగజీవాల మృత్యుకేళి
మానవాళి మేధస్సును ఎండగడుతున్నది

ధరణి మాత ఒడలిన దేహం
ప్లాస్టిక్ మాయాజాలానికి ప్రతీకగా నిలుస్తున్నది

పక్షిజాతి కిలకిలరావాలు మూగబోతున్నవేళ
భూతలస్వర్గం నరకకూపమై దర్శనమిస్తున్నది

జలజీవరాశులు ఆక్సిజన్ అందక మరణిస్తున్న వేళ ప్లాస్టిక్ పరాకాష్ట అవగతమవుతున్నది

మనిషిని మనిషే అనుమానించాల్సిన పరిస్థితుల వలన ప్లాస్టిక్ విలయతాండవం బోధపడుతున్నది.

యావత్ ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వేళ మనిషి సౌకర్యాల డొల్లతనం అర్థమవుతున్నది

ప్రకృతి వైపరీత్యాలు తుదముట్టిన సమయాన
భూతాపం వలన కలగే అనర్థము సాక్షాత్కారింపబడుతున్నది

మనిషి జీవితాన్ని కబళిస్తున్న క్యాన్సర్ వంటి రోగాల వలన మానవ ప్రగతి ప్రశ్నార్ధకమవుతున్నది

భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ
ప్లాస్టిక్ పర్యవసానం తెలుస్తున్నది

ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి పచ్చని ప్రకృతిలో పునీతమవుదాం

ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సకల జీవులకు ప్రాణభిక్ష పెడదాం

ప్లాస్టిక్ వాడకంపై ప్రజలను చైతన్యపరిచి భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!