నా సర్వం నీవు…
రచయిత :: సరిత రవి
నాలోని ప్రేమ రాగమే నీవు
నా ప్రేమ మౌన గీతం నీవు
నా గుండె చప్పుడు నీవు
నా జీవితానికి తోడువు నీవు….
జీవితమనే పాటకు
పల్లవి నీవు
చిగురించిన ఆశలకు అను పల్లవి నీవు
పాట చరణంలోని
భావన నీవు
నా ఎదలో మీటే వీణలోని తీగవు నీవు…
నాప్రేమకై కట్టిన పాటకు కల్పన నీవు
నా అందమైన కలలకు రూపు నీవు
నా కలలో కట్టుకున్న కోటకు రాజువు నీవు
అందమైన క్షణాలను గుర్తుగా నిలిపావు నీవు
నీ జ్ఞాపకాలతో నా హృదయం అంతా నిండావు నీవు
చీకటిలోను మౌనరాగంగా తడిమింది నీవు
నేను రాసే ప్రతి అక్షరకావ్యం నీవు
నా హృదయాన్ని తట్టి లేపింది నీవు కన్నీళ్ళకు తావే లేకుండా నను చూసుకున్నది నీవు
ఓ అనామికలా నీ ప్రేమగా మిగిలిపోయాను నేను..