విచిత్ర ప్రేమ

విచిత్ర ప్రేమ

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు ఉదయాన్నే సర వేగం తో వస్తున్నడు. అప్పటికే విజయ ఇంటి పని అంతా చేసింది తల్లి తండ్రి సంబంధము కోసం ఊరు వెళ్లారు.

కుక్కర్ లో అన్నం పెట్టుకుని స్నానం చేసి వచ్చి పోపులు వె సి కాలేజి కి బాక్స్ సర్దుకుని రెడీ అయ్యింది

కాలింగ్ బెల్ మ్రోగింది
ఇప్పుడు ఎవరూ వచ్చారా అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది

ఓ మీరా! రండి ఇప్పుడు కాలేజి టైమ్ ఐయ్యింది వెళ్ళాలి సాయంత్రం రండి
అయిన ఇప్పుడు అమ్మ నాన్నా లేరు మీరు తర్వాత రండీ అని తాళం గోడ స్టాండ్ నుంచి తీసుకుని తలుపు వేసి ప్రయత్నం చేసింది

ఒక్క నిముషం నా మాట వినండి అని తలుపు పట్టు కొన్నాడు

సరే తొందరగా చెప్పండి నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి మిస్ అవకుడదు అంటూ పుస్తకాల బ్యాగ్ పక్కన పెట్టింది

నేను మీరు ఈ ఇంటికి వచ్చి నప్పటి నుంచి పరిశీలిస్తున్నాను. మా అక్క కూడా మీరు చాలా మంచి పనిమంతురాలి చదువులో సరస్వతి అని చెప్పింది

ఆ హ అలాగ వాళ్ళ పిల్లలకి అప్పుడప్పుడు లెక్కలు చెపుతూ ఉంటుంది అందుకని అల చెప్పింది

నాకు అమ్మ నాన్న ఇద్దురు అక్కలు ఇద్దరు అన్నలు ఉన్నారు. నేను టెలిఫోన్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాను జీతం బాగానే ఉంటుంది

మా అన్నలిద్దరు వారికి నచ్చిన వాళ్ళని చేసుకున్నారు .మా ఇంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు నేను కూడా మిమ్మల్ని ఇష్ట పడుతున్నాను మీరు లేనిదే జీవితం లేదు నేను మనసు లో ఎంతో ఆరాధిస్తాను నమ్మండి మీ అమ్మ నాన్న కన్న బాగా చూసుకుంటాను నా లో లోపాలు ఉంటే సరి దిద్దు కుంటా ను

నా లోపాలు మీరు చెపితే మీకు నచ్చినట్లు మార్చు కుంటాను అని ఎంతో వినయంగా చెప్పాడు

ప్రస్తుతం నేను డిగ్రీ అయ్యేదాకా పెళ్లి అలోచన లేదు అంటూ తాళం వెయ్యాలి కాలేజి సమయం అయ్యింది అంటూ తొందర చేసింది.

సరే అంటూ లేచి ఒకసారి ఆలోచించండి విజయ గారు అంటు విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు
పుచ్చుకుని తాళం వేసి వడి వడిగా వెళ్ళింది

ఆమె వెళ్ళిన వంక ఆరాధన గా చూసాడు

సాయంత్రానికి తల్లి తండ్రి వచ్చారు పెళ్లి సంబంధం కుదిరినట్లే ఉన్నది పిల్లని అడగాలి.

సాయంత్రం పిల్ల రాగానే విషయం చెప్పారు

సరే నాన్న ఇంటి వాళ్ళ కోడలు తమ్ముడు రాజీవ్ వచ్చి నట్లు చెప్పింది

ఆహా అలాగ అని ఊరుకున్నాను
డిగ్రీ అయ్యేదాకా వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు చదువు కో వచ్చు .పి జి కూడా చేయిస్తారు అన్నారు
అయిన పెళ్లి తరువాత అవన్నీ ఆలో చించ వచ్చును

విజయ చాలా అలోచనలోంపడింది. తను పి జీ చేసి డాక్టరేట్ చెయ్యాలని కోరిక .పెళ్లి అప్పుడే వద్దు అనుకున్నది
అదే మాట తల్లి తండ్రితో అంటే నేను రిటైర్ అవుతాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి అవదు ఇప్పటి నుంచి చూస్తున్నాను అన్నాడు

మంచి సంబంధం వచ్చి నప్పుడే పెళ్లి చేసుకోవాలి అన్నాడు
నాలుగు నెలలు గడిచింది.
పరీక్షలు అయ్యాయి
పెళ్ళివారు అడిగిన కట్నం ఇవ్వడం కొంచెం కష్ట మయ్యింది ఆడపడుచు లాంఛనాలు తీసుకోవటానికి ఇష్టం లేదు కానీ ఆడపిల్లలు విదేశాల్లో ఉన్నారు వాళ్ళకి విమానం టికెట్స్ కొనాలి అని చెప్పారు ఇలా వారు కోరే కోరికలు పెరిగి పోతున్నాయి

దాంతో విజయకి విసుగు వచ్చింది నాన్న ఈ సంబంధం కాక పోతే ఇంకొకటి నేను పీజీ చేస్టాను అని అప్లయ్ చేసి రిట్టేన్ టెస్ట్ పాసయ్యి చేరింది

ఎమ్మెస్ సి లో బోటని మైన్ గా తీసుకున్నది బొమ్మలు బాగా వేస్తుంది

ఇదే అదను అని ఇంటి వారి కోడలు సునంద మా తమ్ముడు మీ పిల్లని ఇష్ట పడ్డాడు కట్నం లాంఛనాలు ఏమి వద్దు పెళ్లి కూడా మేమే చూసుకుంటాము

మీరు మీ పిల్ల రండీ అని చెప్పింది చాలా ఆలోచించారు

విజయ మాత్రం చదువులో మునిగింది ఉన్న ఊళ్ళో చదువు ఆనందం గా ఉంది

రాజీవ్ అప్పుడప్పుడు వచ్చే వాడు ఇలా ఏడాది గడిచింది
ఈ వేసవిలో పట్టు పట్టి పెళ్లికి ముహూర్తం పెట్టిన విషయం విజయ కి చెప్పాడు ఇదేమిటి నాకు పి జీ అవ్వాలి అన్నది
పెళ్లి తరువాత ఏదైనా చెయ్యవచ్చు ముందు పెళ్లి ముఖ్యం అంటూ తల్లి తండ్రి నీ వత్తిడి చేసి అక్కతమ్ముడు తల్లి తండ్రి అంతా బట్టలు స్వీట్స్ తెచ్చి పెళ్లికి వప్పించా రు కుక్కు వచ్చిన కళ్యాణం వచ్చినా ఆగదు అంటూ నెల రోజుల్లో పెళ్లి కి అన్ని ఏర్పాట్లు చేసి సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు
రాజీవ్ కార్య శూరుడు .

విజయ చదువు కొన సాగింది
ఫి జీ అయ్యింది ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి జూనియర్ కాలేజి లెక్చరర్ గా చేరింది

నువ్వే ప్రాణం నువ్వు లేకుండా బ్రతక లేను అని చెప్పిన రాజీవ్ ప్రతి విషయానికి కొప్పడటం తన జీతం చాలదు నీ జీతం కూడా ఇంటి ఖర్చు పెట్టు మా అమ్మ నాన్నకి డబ్బు పంపాలి అన్నాడు

ప్రతి పండుగకు వదినలు వచ్చేవారు ఇంటిల్లి పాదికి బట్టలు అంటే పదివేలు ఖర్చు అయ్యేది

మాకు ఆఖరి తమ్ముడు ప్రాణం వాడు నిన్ను ప్రేమించిన కట్నం పై సా లేకుండా చేసుకున్నాడని తరచూ అనే వారు

పిల్లల చదువులకు పుట్టిన రోజులకు బహుమతులు ఉండేవి
కాలంతో పాటు విజయికి ఇద్దరు ఆడపిల్లలు కుటుంబ భాధ్యతలు అన్ని తనే చూసుకోవాలి ఒక సారి భర్తతో అదే అంటే నువ్వు సమర్ధు రాలివని తెలిసి చేసుకున్నాను
అందుకే నిన్ను ప్రేమించాను

నెల వారి జీతం తేస్తవు నా డబ్బుతో ఇల్లు కొంటాను కదా అని లోన్ పెట్టీ ఇల్లు కొనేసాడు

అత్తగారికి కోడలు రిజర్వ్ బ్యాంక్ లాంటిది రోజు వారీ కూడా పట్టు చీరెలు కట్టేది

పెళ్లి కి ఏమి లాంఛనాలు వద్గు అన్నాను కాని పెళ్లి తరువాత కొనడం నీ బాధ్యత అని నవ్వింది
రాజీవ్ అవును అవును అంటూ వంత పలికాడు మా ఇంట్లో వంట మనిషి పని మనిషి కూడా అతి ఖరీదు చీరలు కడతారు.అంటూ పండగలకి పని వాళ్ళకి కూడా ఖరీదు చీరలు కొనిపించే వాడు.

ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎంతో స్వార్థం చూపుతున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి

ఈ విచిత్ర ప్రేమ పేరుతో ఎన్నో విధాలుగా వింతలు విడ్డురము వింటున్నాము చూస్తున్నాను
నానా టీ బ్రతుకు నాటకము అని రేవతి రాగ శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన ఎమ్మెస్ గళం నుంచి వినిపిస్తోంది. జీవితంలో ఎన్నో మలుపులు ప్రతి మలుపు చిత్రంగా ఉంటుంది

విజయ లాంటి ఎందరో అమ్మాయిలు నిజమైన నిజాయితీ ఉన్న ప్రేమ నువ్వు ఎక్కడ?
విజయ ప్రశ్న తరచూ అనుకుంటుంది కానీ సమాధానం లేదు

నేడు ఎందరో అమ్మాయిలు విచిత్ర ప్రేమలో జీవిస్తున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!