మాట్లాడుతున్న మన జెండా

 మాట్లాడుతున్న మన జెండా

రచయిత: వడ్డాది రవికాంత్ శర్మ

ఎర్రకోటపై ఎగురుతున్న జెండా ప్రశ్నిస్తుంది …/
ఏడు దశాబ్దాల పైబడ్డ అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని …/
ఏలిన వారి అనుభవాన్ని …/
కుర్చీపై కన్నేసిన ప్రశ్నించే గొంతుకలని ../

కర్షకుని హలం తరుపున నిలదీస్తున్నది ../
పండిన ప్రతిగింజను దాచే ధాన్యాగారాలు కట్టించమని ../
సత్తువున్న తమ విత్తనాన్ని విశ్వమెల్ల ఎగుమతి చేయమని ../
వడి వడిగా వ్యవసాయాన్ని లాభసాటి చేయమని ../

అభద్రతకు లోనైన అతివకు అంబురమై నిలిచి అడుగుతోంది ../
సైబర్ భద్రతను కల్పించి పనిచేసే చోట రక్షణ కల్పించమని ../
నెలసరి సెలవులను ప్రాథమిక హక్కుగా ఎందుకు చేర్చరాదని …/
మాతృత్వపు మమకారాన్ని పోషకాహారపు చట్రంతో కలపమని ../

నిస్తేజంలోనున్న నిరుద్యోగికి మార్గనిర్దేశనం చేస్తోంది ../
సర్కారు కొలువుపై సవాలక్ష ఆలోచనలు మాని ../
నీదైన నైపుణ్యంతో , నీవాళ్లమధ్య హీరోలా బ్రతకమని ../
స్వావలంభన భారత్ లో సత్తువతో నిలిచి గెలవమని ../

విలువలతో రాజకీయాలు చేయమని …/
అందరికీ అవకాశాలు పంచమని …/
మాదక ద్రవ్య మత్తుని చీల్చి చెండాడమని…/
సంఘ విద్రోహశక్తులపై చట్టబద్దమైన చర్య త్వరితగతిన తీసుకొమ్మని ../

మూడురంగుల జెండా ముందుగానే హెచ్చరిస్తోంది../
సురక్షిత సరిహద్దులకై , అంతర్గత భద్రతకై …/
గురితప్పని లక్ష్యాలకై , జగతిని జాగరూకం చేసే ../
నవభారత నిర్మాణానికై , ఎర్రకోట సాక్షిగా హుంకారం చేస్తోంది ../

You May Also Like

5 thoughts on “మాట్లాడుతున్న మన జెండా

  1. జాతీయ జెండాకు మాటలు వస్తె,ఇలానే అడిగేదేమో…చాలా చక్కగా రాసారు అండి కవిత👌👌👌

  2. జెండా కి మాటలు వస్తే ఎలా ఉంటుందో అలా బాగా చెప్పారు రవి గారు 👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!