మానవత్వం మేల్కొంది!

(అంశం : “మానవత్వం”)

మానవత్వం మేల్కొంది!

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

ఆఫీసునుండి ఇంటికి వస్తున్నాడు సురేశు.పనెక్కుడుండడంవలన ఆలస్యమైపోయింది.
బైకు రిపేరులోవుంది.కాళ్ళకి బుద్ది చెప్పాల్సిందేననుకొని కొంచెం అడుగులు వేగంగా
వేయనారంబించాడు.ఎంత వేగంగా నడిచినా అరగంటకు పైగా పడుతుంది.వెళ్తూ బైకు రిపెయిర్
ఎంతవరకు వచ్చిందో కనుక్కొవాలి.అలా ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు.ఇంతలో వెనుకనుంచి
ఆఫిసుకొలీగ్ వేణు పక్కనే బండి ఆపి “ఎక్కండి
గురువుగారు .అయినా ఇంత ఆలస్యంగా వస్తున్నారేమిటి?నేను అలా బజారుకెళ్ళి సరుకులు
కూడా కొనేసి వస్తున్నాను.మిమ్మల్ని ఇంటి దగ్గర
దింపేసి వెళ్తాను.”అంటూ వేణు సురేశుకి పిలిచాడు.
“ఎందుకులె వేణు కొంచెం నాకు మెకానిక్ దగ్గర పనుంది.ఆ పని చూసుకొని వెళ్తాను.నీకు ఆలస్యమవుతుంది.”వేణుని వెళ్ళిపొమ్మని చెప్పాడు
సురేశు.
“ఇప్పటికే ఆలస్యమైంది గురువుగారు రేపు ఆ పని
చూసుకొవచ్చు.”వేణు బలవంతం చేసాడు.
“లేదులే ..సురేశేదో చెప్పబోతుంటే ఫోనురింగైంది.భార్య సంధ్యనుండి”ఏమండి !ఇంకా ఆఫిసులొనే ఉన్నారా?
బైకు కూడా రిపేరులొ వుంది.పోని పక్కింటి రఘును
పంపనా?”
“వద్దలే మా ఆఫిసులొ నా సహోద్యోగి బండిమీద వస్తున్నా”ఫోను పెట్టేసి వేణుబండి ఎక్కెసాడు.
ఇద్దరూ వేణుబండిమీద బయలుదేరారు.
సురేశువాళ్ళ ఇంటివైపు రోడ్డు టర్నింగుతిరుగుతుంటే
ఎదురుగా ఇద్దరుయువకులు స్పీడుగా బండిమీదవస్తూ వేణుబండిని గుద్దేశారు.కంట్రోల్ తప్పడంతో వేణు బండి అదుపుతప్పి పక్కనే పెద్ద
రాయిమీదపడిపోయాడు.వేణు వెంటనే స్ప్రుహకోల్పోయాడు.దెబ్బలుకూడా గట్టిగానే
తగిలాయి.సురేశుకు మాత్రం ఏమి కాలేదు.వెంటనే
ఆంబులెన్స్కి ఫోను చేశాడు.పోలీసులకుకూడా
తెలియజేసి బండినీ అక్కడవదిలేసి వేణుతోపాటు
ఆంబులెన్స్ ఎక్కేశాడు.మళ్ళీ సంధ్యనుండి ఫోను రింగవుతుంటే తనకి చెబుతే టెన్షనవుతుందని
ఫోనుస్విచ్ఛాఫ్ చేసేశాడు.
వేణుకి కొత్తగా పెళ్తైంది.మంచి తెలివైన కుర్రాడు.
వేణు భార్య ప్రస్తుతం ఊర్లోలేదని పుట్టింటికెళ్ళిందని
వేణు చెప్పడం గుర్తు.హాస్పిటల్ కి వెళ్ళాక పరిస్తితిని
బట్టి ఫోనుచేయ్యోచ్చని ఊరుకున్నాడు.
హస్పిటల్కి వెళ్ళాక అక్కడ తెలిసిన డాక్టర్ శ్రీధర్
కి కలిసి అన్నీ విషయాలు చెప్పాడు.
ఎమర్జన్సివార్డులోకి వేణుని తీసుకొని వెళ్ళారు.డా.శ్రీధర్ నేను చూస్తానని మరేమి భయపడవద్దని చెప్పి తనూ వెళ్ళాడు.వార్డుబయట
తను డాక్టర్లేమిటి ఎమిటి చెబుతారోనని ఆందొళనతొ
కూర్చున్నాడు.
పావుగంట తరువాత డా.శ్రీధర్ వచ్చి మరేం పర్వాలేదు.రక్తం బాగా పోయింది.రక్తం ఎక్కించాలి.
అతని రక్తం గ్రూపు వుందోలేదో చూడడానికి నర్సు
వెళ్ళింది.అతనికి స్ప్రహరావడానికి ఒక గంట సమయం పడుతుంది.
ఇంతలో నర్సువచ్చి “డాక్టర్ !బి పోజిటివ్ గ్రూపు
బ్లడ్ మన దగ్గర లేదు.ఏం చేద్దామ్ సార్?”నర్సు చెప్పింది.
“శ్రీధర్ నా బ్లడ్ గ్రూపు అదే.నేనిస్తాను రక్తం.”అంటూ
సురేశ్ ముందుకు వచ్చాడు.
డా.శ్రీధర్ నర్సుకు సురేశు రక్తం తీసుకోమని పురమాయించాడు.
నర్సుతోపాటు సురేశు వెళ్ళాడు.
సురేశు రక్తం ఇవ్వడంతో వేణుకు ఎక్కించారు.ఒక
గంటలో వేణుకు స్ప్రుహ వచ్చింది.డా.శ్రీధర్
వేణును పరీక్షించి కనీసం వారంరోజులు పాటు
హస్పిటల్ లో ఉండాలని చెప్పడంతో వేణుని
ఒకసారిచూసి పలకరించి అతనికి ధౌర్యం చెప్పి
తన వాళ్ళకి తెలియజేస్తానని ఫోను తీసుకున్నాడు
నర్సుదగ్గర.వాళ్ళకి ఫోను చేసి తను ఇంటికి బయలుదేరాడు.సమయానికి వేణుని హాస్పిటల్ లో
చేర్చడంతో ప్రమాదం తప్పిందని డాక్టరు సురేశుతో
చెప్పాడు.వేణుగురించి అడగగా అతను తన ఆఫీసు
సహోద్యోగని చెప్పాడు.
అక్కడక్కాడ మానవత్వం ఉన్న వాళ్ళు ఇంకా ఉండబట్టే సంబంధాలు నిలబడుతాయని తెలుస్తోంది
కదండి.మానవత్వం మేల్కొంది!
****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!